Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్గిల్ యుద్ధంతోనే భారత్ చర్చలకు వచ్చింది

Webdunia
పాకిస్థాన్‌కు కూడా కార్గిల్ యుద్ధం పెద్ద విజయాన్ని సాధించిపెట్టిందని ఆ దేశ మాజీ సైనిక నియంత జనరల్ పర్వేజ్ ముషారఫ్ అభిప్రాయపడ్డారు. కార్గిల్ యుద్ధం కారణంగానే భారత ప్రభుత్వం కాశ్మీర్‌పై పాకిస్థాన్‌తో చర్చలకు అంగీకరించిందని తెలిపారు. 1999లో ఇరుదేశాల మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సేనలు పాక్ సైనిక చొరబాటుదారులను విజయవంతంగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే.

ఈ యుద్ధంలో వాస్తవానికి పాకిస్థాన్ కార్గిల్ నుంచి వెనుదిరిగినప్పటికీ, భారత్ వైఖరిలో మార్పు తేవడంలో తాము ఈ యుద్ధం ద్వారా విజయవంతమయ్యామన్నారు. కాశ్మీర్‌పై భారత్ చర్చలు ఎలా ప్రారంభమయ్యాయని ముషారఫ్ ప్రశ్నించారు. కాశ్మీర్ వివాదంపై భారతీయులు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనేందుకు ముందుకొచ్చారని, ఇదంతా కార్గిల్ యుద్ధ ఫలితమేనని తెలిపారు.

భారత టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ముషారఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్గిల్ యుద్ధానికి ముందు ఇరుదేశాల మధ్య కాశ్మీర్ వివాదంపై చర్చల ప్రక్రియలేమీ లేవనే విషయాన్ని ముషారఫ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1999లో జరిగిన వివాదాస్పద కార్గిల్ యుద్ధాన్ని అదే ఏడాది రక్తపాతరహిత తిరుగుబాటు ద్వారా పాకిస్థాన్ పాలనా పగ్గాలు చేపట్టిన ముషారఫ్ గట్టిగా సమర్థించుకున్నారు.

తన హయంకు ముందు పాకిస్థాన్ పాలకులు కాశ్మీర్ అంశాన్ని పట్టించుకునేవారు కాదు. ఐక్యరాజ్యసమితిలో తమ నేతలు చేసే ప్రసంగాల్లోనూ కాశ్మీర్ అంశం ఉండదు. ఎందుకంటే వారు భారత్ మద్దతుదారులు. అందువలనే భారత్ దీనిపై అంతకుముందు చర్చలకు రాలేదు. అయితే కార్గిల్ యుద్ధం తరువాత పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు.

కాశ్మీర్‌పై చర్చలకు భారత్ ముందుకొచ్చిందని పేర్కొన్నారు. కార్గిల్ ఆపరేషన్‌లో పాల్గొన్నవారిలో పాకిస్థాన్ ఆర్మీలోని రావల్పిండి కార్ప్స్, ఫోర్స్ కమాండ్ నార్తరన్ ఏరియాస్ సిబ్బంది ఉన్నారని ముషారఫ్ అంగీకరించారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నవారు స్వాతంత్ర్య సమరయోధులని, తమ సైన్యం కాదని గతంలో పాకిస్థాన్ ప్రభుత్వం వాదించిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments