Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీటి వీడ్కోలుతో మైఖేల్ అంతిమ యాత్ర

Webdunia
DBMG
పాప్‌ సంగీత ప్రపంచంలో ధృవతారగా ఓ వెలుగు వెలిగిన మైఖేల్‌ జాక్సన్‌కు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన వేలాది మంది అభిమానులు అంతిమ యాత్రలో పాల్గొని ఘనంగా వీడ్కోలు పలికారు.

ఒక దేశాధినేతకు జరిగే తీరులో మైఖేల్ జాక్సన్ అంత్యక్రియలు జరిగాయి. ఆయన మృత దేహానికి స్టేపుల్స్‌ సెంటర్‌ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. ఫారెస్ట్ లాన్ సిమెట్రిలో అంత్యక్రియలు నిర్వహించి పార్థివ శరీరాన్ని ఖననం చేశారు.

ఎర్రటి పూలతో అలంకరించిన 25వేల డాలర్లు విలువ చేసే బంగారు శవపేటికలో ఆయన మృత దేహాన్ని ఉంచారు. పలు దేశాల్లోని వివిధ టీవీ ఛానెళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఆయన అంత్యక్రియలను ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా తిలకించి ఉంటారని అంచనా.

ఇదిలావుండగా మైఖేల్‌ అంత్యక్రియలను తిలకించేందుకు నిర్వాహకులు అమ్మిన టికెట్ల కోసం దాదాపు 16 లక్షల మంది ఆన్‌లైన్‌లో పోటీ పడగా వీరిలో కేవలం 8,750 మందికి మాత్రమే అనుమతి లభించింది. జాక్సన్‌ అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారాన్ని అమెరికా దేశం ప్రపంచవ్యాప్తంగా లాస్‌ఏంజెల్స్‌ నుండి ప్రత్యక్షప్రసారాలకు అనుమతినిచ్చింది. కాగా లాస్ ఏంజిల్స్ నుంచి వాషింగ్టన్‌ వరకు దాదాపు 50 సినిమా థియేటర్లు జాక్సన్ అంతిమ యాత్రను ప్రత్యక్ష ప్రసారం చేశాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments