Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒసామా ఆచూకీ పాక్ అధికారులకు తెలుసు: హిల్లరీ

Webdunia
సోమవారం, 10 మే 2010 (17:42 IST)
అంతర్జాతీయ నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ పాకిస్థాన్ అధికారులకు తెలుసని అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అభిప్రాయపడ్డారు. పాక్ ప్రభుత్వంలోని కొన్ని శక్తులకు (అధికారులకు) అల్‌ఖైదా, తాలిబన్ నేతల ఆచూకీ ఎరుకేనని ఆయన చెప్పారు. టైమ్స్ స్క్వేర్ బాంబింగ్ ప్లాట్ సంఘటన అనంతరం వాషింగ్టన్ యంత్రాంగం ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం.

దీనిపై ఆమె మాట్లాడుతూ.. లాడెన్ గురించిన సమాచారం ఉన్నత స్థాయి వర్గాలకు తెలుసని తాను చెప్పలేను. కానీ కొంతమంది ప్రభుత్వంలోని కొంతమందికి లాడెన్, ముల్లా ఓమర్, ఆప్ఘనిస్థాన్‌లోని తాలిబన్ నేతల ఆచూకీ తెలుసన్నారు.9/11 దాడులతో సంబంధం ఉన్న వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు లేదా పట్టుకునేందుకు లేదా చంపేందుకు పాకిస్థాన్ నుంచి మరింత సహకారం కోరుతూ ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

ఒకవేళ ఇందుకు పాకిస్థాన్ సహకరించని పక్షంలో ఏం చేస్తారని ప్రశ్నించగా, ప్రస్తుతం వారిలో మార్పు వచ్చింది. అది మరింతగా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఇకపోతే టైమ్స్ స్క్వేర్ కారు బాంబు ఘటనతో సంబంధం ఉన్న వారిని పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టినట్టు ఆమె తెలిపారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments