Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐరాస భద్రతా మండలిలో సభ్యత్వం అంత సులువు కాదు

Webdunia
ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో భారదేశం శాస్వత సభ్యత్వాన్ని సంపాధించడం అంత సులువు కాదని ఇద్దరు పాకిస్థాన్ ఫెడరల్ మంత్రులు వ్యాఖ్యానించారు. ఐరాసలో భారత్ శాస్వత సభ్యత్వానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు ఇవ్వడంపై వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఐరాస భద్రతా మండలిలలో న్యూఢిల్లీ శాస్వత సభ్యత్వాన్ని పొందాలనే లక్ష్యం అంత సులువైనదని కాదని వారు వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ రక్షణ మంత్రి చౌదరి అహ్మద్ ముక్తర్ మాట్లాడుతూ.. "అదంత సులువు కాదు" (ఐరాస భద్రతా మండలిలలో భారత శాస్వత సభ్యత్వం) అని అన్నారు. అంతేకాదు, భద్రతా మండలి విస్తరణ విషయంలో పాకిస్థాన్‌ను కూడా కలుపుకుని పోయినట్లయితే అది ఈ ప్రాంతంలో శాంతికి ఎంతో దోహదపడుతుందని కూడా ఆయన అన్నారు.

ఇదే అంశంపై విద్యాశాఖ మంత్రి సర్దార్ అసిఫ్ అహ్మద్ అలీ మాట్లాడుతూ.. భద్రతా మండలిలలో పర్మినెంట్ సీట్ కోసం భారత్‌ను అంతర్జాతీయ పరిస్థితులు అనుమతించబోవని అన్నారు. ఐరాస భద్రతా మండలిలో శాస్వత సభ్యత్వం పొందడం ఒబామా ప్రభుత్వాన్ని ఒప్పించినంత సులభం కాదని ఆయన రేడియో పాకిస్తాన్‌తో అన్నారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి చాలా దేశాలు పోటీ పడుతున్నాయని, అయితే అంతర్జాతీయ పరిస్థితి భారత్‌కు అనుకూలంగా లేదని కూడా ఆయన వాదించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

Show comments