Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరిన జపాన్ నిరుద్యోగం

Webdunia
జపాన్‌లో నిరుద్యోగ రేటు ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత అత్యంత దారుణమైన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ప్రస్తుతం ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఆర్థిక మాంద్యం కారణంగా జపాన్ కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ఆయా కంపెనీలు మనుగడ కోసం ఉద్యోగులపై వేటు వేశాయి.

జపాన్ కంపెనీలు ఉద్యోగాలు తగ్గించివేయడంతో దేశంలో నిరుద్యోగ రేటు ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుందని తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే గత 16 నెలల్లో తొలిసారి వినియోగదారుల వ్యయం పెరగడం ఆశాజనకంగా మారింది. జపాన్ ప్రభుత్వం ఆర్థిక ఉద్దీపన చర్యల కారణంగా వినియోగదారులు వ్యయం కొంతమేర పెరిగింది.

మే నెలలో జపాన్ నిరుద్యోగ రేటు 5.2 శాతానికి చేరుకుంది. దేశంలో ఈ స్థాయిలో నిరుద్యోగ రేటు సెప్టెంబరు 2003లో నమోదయింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నిరుద్యోగ రేటు 5.0 శాతం వద్ద ఉందని జపాన్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఆర్థిక మాంద్యం కారణంగా ఎగుమతులు, ఉత్పత్తి బాగా పడిపోవడంతో జపాన్ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటుంది.

మే నెలలో దేశంలో నిరుద్యోగుల సంఖ్య 770000కి చేరుకుంది. ఏడాది క్రితం ఇదే సమయంలో నిరుద్యోగుల సంఖ్య 3.47 మిలియన్ల వద్ద ఉండగా అది ఇప్పుడు 28.5 శాతం మేర పెరిగిందని జపాన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అనేక జపాన్ కంపెనీలు, ముఖ్యంగా ఎగుమతుల ఆధారిత కంపెనీలు ఉద్యోగాల్లో భారీగా కోతపెట్టాయి.

అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా డిమాండ్ బాగా పడిపోవడంతో పరిశ్రమల ఉత్పాదకత కూడా బాగా దెబ్బతింది. మేలో ఉద్యోగులకు వెళుతున్న ప్రతి వంద మందికి 44 ఉద్యోగాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్‌లో అయితే 46 ఉద్యోగులు అందుబాటులో ఉన్నాయని జపాన్ కార్మిక శాఖ మంగళవారం తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

Show comments