Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ ఫ్రాన్స్ విమాన తొలి శకలాల లభ్యం

Webdunia
అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రమాదవశాత్తూ కూలిపోయిన ఎయిర్ ఫ్రాన్స్ విమానం తొలి శకలాలు గురువారం బ్రెజిల్ హెలికాప్టర్ సిబ్బందికి లభ్యమయ్యాయి. విమాన నిర్మాణంలో భాగమైన 2.5 మీటర్ల పొడవున్న ఓ ముక్కను బ్రెజిల్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే ఇది లభ్యమైన ప్రదేశంలో మానవ దేహాల జాడలేమీ కనిపించలేదని బ్రెజిల్ అధికారిక యంత్రాంగం తెలిపింది. ఎయిర్ ఫ్రాన్స్‌కు చెందిన జెట్ విమానం సోమవారం బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో నుంచి పారిస్‌కు వెళుతూ తుపాను, పిడుగుపాటు, విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యల కారణంగా అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది.

ఈ విమానంలోని 228 మంది ప్రయాణికులు మృతి చెందారు. నీటిమీద తేలుతున్న రెండు విమాన భాగాలు కూడా లభ్యమయ్యాయని బ్రెజిల్ అధికారులు తెలిపారు. కూలిపోయిన విమానానికి సంబంధించి లభ్యమైన తొలి శకలాలు ఇవే కావడం గమనార్హం. 2001 తరువాత ప్రపంచంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం కూడా ఇదే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments