Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌ఫ్రాన్స్ ప్రమాదం: మరిన్ని శకలాల లభ్యం

Webdunia
అట్లాంటిక్ మహాసముద్రంలో జూన్ 1న కూలిపోయిన ఎయిర్ ఫ్రాన్స్ విమాన శకలాల కోసం గాలింపు చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ విమానానికి చెందిన మరిన్ని శకాలలను బ్రెజిల్ మిలిటరీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో నుంచి పారిస్ వెళుతున్న ఎయిర్ ఫ్రాన్స్ జెట్ విమానం మార్గమధ్యంలో సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే.

ఈ విమాన ప్రమాదంలో 228 మంది ప్రాణాలు కోల్పోయారు. 2001 తరువాత ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఘోర విమాన ప్రమాదం ఇదే. ఇప్పటివరకు ప్రమాదంలో మృతి చెందిన 49 మంది భౌతికకాయాలను సహాయక సిబ్బంది గుర్తించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ విమానానికి సంబంధించిన మరిన్ని శకలాలు సముద్రంలో లభ్యమయ్యాయని బ్రెజిల్ మిలిటరీ అధికారులు తెలిపారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణంగా కూలిపోయిన విమానంలోని ప్రయాణికుల మృతదేహాలను, దాని శకలాలను వెలికితీసేందుకు కొన్ని రోజులపాటు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం వాతావరణం గాలింపు చర్యలకు అనుకూలిస్తోందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. బ్రెజిల్, ఫ్రాన్స్ నౌకా దళాలు కూడా విమాన శకలాలు, బ్లాక్‌బాక్స్‌లు, ప్రయాణికుల మృతదేహాల గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments