Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల బందీలను విడిచిపెట్టాలి: రఫ్సంజానీ

Webdunia
గత నెలలో వివాదాస్పద అధ్యక్ష ఎన్నికలపై జరిగిన భారీ నిరసన ప్రదర్శనల సందర్భంగా అదుపులోకి తీసుకున్న వందలాది మంది ఆందోళనకారులను విడిచిపెట్టాలని ఇరాన్‌లో శక్తివంతమైన మతపెద్ద అక్బర్ హషేమీ రఫ్సంజానీ పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. గత నెలలో అరెస్టు చేసిన ఎన్నికల బందీలను విడిచిపెట్టాలన్నారు.

వివాదాస్పద అధ్యక్ష ఎన్నికలు ఇరానీయన్లు విశ్వాసాన్ని వమ్ము చేశాయన్నారు. దీనికి మనమేం చేయాలని ఇరాన్ మాజీ అధ్యక్షుడు రఫ్సంజానీ ప్రశ్నించారు. రెండు ప్రధాన సంస్థలతో సంప్రదింపులు జరిపిన తాను ఓ పరిష్కారాన్ని రూపొందించానని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనడమే మనముందున్న ప్రధాన కార్తవ్యమని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల బందీలను జైళ్లలో ఉంచాల్సిన అవసరం లేదు. వారిని విడిచిపెట్టాలి. ప్రత్యర్థులకు విమర్శించే అవకాశం ఇవ్వరాదు. ఇరువర్గాలు ఒకరినొకరు గౌరవించుకోవాలని సూచించారు. గత నెల 12న జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల్లో అహ్మదీనెజాద్ అక్రమ మార్గాల్లో గెలిచారని ఆరోపిస్తూ ఆయన ప్రత్యర్థులు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. కొన్నివారాలపాటు జరిగిన ఆందోళనల్లో అధికారిక యంత్రాంగం వందలాది మంది పౌరులను నిర్బంధించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Show comments