Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొంటాం: ఇరాన్

Webdunia
ఖండాతర క్షిపణి ప్రయోగం విజయవంతం కావడం ఇరాన్ మిలిటరీకి కొత్త ఉత్సాహం ఇస్తోంది. ఈ అధునాతన క్షిపణితో ఎటువంటి ముప్పునైనా తాము ఎదుర్కోగలమని ఇరాన్ మిలిటరీ ధీమా వ్యక్తం చేసింది. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకోవాలనుకునే ఎటువంటి ప్రదేశాన్నైనా (దేశాన్ని) తాము అందుకోగలమని హెచ్చరించింది.

ఇరాన్ తాజాగా పరీక్షించిన ఖండాతర క్షిపణి మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయేల్, యూరప్‌లోని కొన్ని ప్రాంతాలను అందుకోగలదు. రెండు రోజుల క్రితం ఇరాన్‌లో యుద్ధ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇరాన్ వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమంపై పశ్చిమ దేశాలు ఇప్పటికీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుండటం వాటిని మరింత రెచ్చగొట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ వారం ఐక్యరాజ్యసమితిలోని ఐదు శాశ్విత సభ్య దేశాలు, జర్మనీ వివాదాస్పద అణు కార్యక్రమంపై ఇరాన్‌తో సమావేశమవుతున్నాయి. ఈ సమావేశంలో ఇరాన్ నుంచి అణు కార్యక్రమంపై, రహస్యంగా నిర్మిస్తున్న రెండో అణు ప్లాంటుపై సూటి సమాధానాలు కోరే అవకాశం ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments