Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉ కొరియాకు పాక్ అణు సాంకేతిక పరిజ్ఞానం

Webdunia
ఉత్తర కొరియా నుంచి ఖండాంతర క్షిపణి పరిజ్ఞానాన్ని పొందినందుకు బదులుగా పాకిస్థాన్ తన వద్ద ఉన్న యురేనియం శుద్ధి సెంట్రిప్యూజ్‌ల డిజైన్లను ఆ దేశానికి అందజేసిందని అమెరికా కాంగ్రెస్ నివేదిక వెల్లడించింది. 1997లో పరాజయం పాలైన కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి హవాంగ్ జాంగ్ యోప్ ఉత్తర కొరియా, పాకిస్థాన్ మధ్య దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరినట్లు వెల్లడించారని నివేదిక పేర్కొంది.

హెచ్ఈయూ (బాగా శుద్ధి చేసిన యురేనియం), ఖండాంతర క్షిపణి పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు పాకిస్థాన్, ఉత్తర కొరియా మధ్య 1996లో ఒప్పందం కుదిరినట్లు హవాంగ్ చెప్పినట్లు తాజాగా ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమంపై అమెరికా కాంగ్రెస్ సిద్ధం చేసిన నివేదిక వెల్లడించింది. ఇదిలా ఉంటే ఉత్తర కొరియా మధ్యప్రాచ్య, దక్షిణాసియా ప్రాంతాల్లోని దేశాలకు క్షిపణులు ఎగుమతి చేస్తుందని తెలిపింది.

ఇరాన్, పాకిస్థాన్‌లతో ఉత్తర కొరియాకు సంయుక్త క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలు సాగించిందని కాంగ్రెస్ నివేదిక పేర్కొంది. 1990లలో ఉత్తర కొరియా స్కడ్, నోడోంగ్ క్షిపణులను పాకిస్థాన్, ఇరాన్, యెమెన్, సిరియాలకు ఎగుమతి చేసింది. అదే కాలంలో ఈ క్షిపణులను ఈజిప్టుకు కూడా ఎగుమతి చేసినట్లు తెలుస్తోందని అమెరికా తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments