Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమ్మడి నిఘాపై భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య ఒప్పందం!

Webdunia
సరిహద్దు ఉమ్మడి నిఘాపై భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య కీలకమైన ఒప్పందం కుదిరింది. సమగ్ర సరిహద్దు నిర్వహణ, మనుషుల అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, ఆయుధాల స్మగ్లింగ్ వంటివి సరిహద్దుల మీదుగా జరగకుండా నిరోధించేందుకు సంయుక్త నిఘా చర్యలు చేపట్టడం ద్వారా సరిహద్దుల వెంబడి భద్రతను పటిష్టం చేయడం ఈ ఒప్పందంలోని కీలకాంశం.

ఈ ఒప్పంద పత్రాలపై ఇరు దేశాల హోంమంత్రులు పి.చిదంబరం, సహరా ఖాటున్‌ల సమక్షంలో బంగ్లా బోర్డర్ గార్డ్స్ డెరైక్టర్ జనరల్ మేజర్ జనరల్ అన్వర్ హుస్సేన్, భారత్‌కు చెందిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) అధిపతి రామన్ శ్రీవాత్సవలు సంతకాలు చేశారు.

దీనిపై మంత్రి చిదంబరం మాట్లాడుతూ సీమాంతర నేరాలను అరికట్టడంతో పాటు అన్ని సరిహద్దు సమస్యలను పరిష్కరించేందుకు ఈ ఒప్పందం దోహదపడగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే, తీవ్రవాదంపై భారత్ తీసుకునే చర్యలకు బంగ్లాదేశ్ తన వంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

వచ్చే సెప్టెంబరు ప్రధాని మన్మోహన్‌సింగ్ బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారని, ఈలోపు సరిహద్దులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించుకోగలమన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. సీమాంతర భద్రత అంశం రెండు దేశాల సమస్యగా చిదంబరం అభివర్ణించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

Show comments