Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్లామాబాద్‌లో 25మంది ఉగ్రవాదుల అరెస్ట్

Webdunia
పాకిస్థాన్ పోలీసులు ఇస్లామాబాద్‌లో బుధవారంనాడు 25మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.

ఇస్లామాబాద్‌లో బుధవారంనాడు 25మంది ఉగ్రవాదులను పాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆరుగురు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్. వీరంతా లాహోర్, కరాచీలాంటి ప్రముఖ పట్టణాలలో దాడులకు రూపకల్పన చేసినవారేనని పోలీసులు తెలిపారు.

తాము అదుపులోకి తీసుకున్న అనుమానిత ఉగ్రవాదుల్లో చాలామంది ఆత్మాహుతి దాడులకు పాల్పడేవారని, మరికొంతమంది వీరికి సహాయకులగా ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.

పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్న వారిని ప్రముఖ ఉగ్రవాదులుగా ప్రకటిస్తున్నట్లు పోలీసు డైరెక్టర్ జనరల్ సైయద్ కలీమ్ ఇమామ్ పేర్కొన్నారు. వీరిలో ఆరుగురు మోస్ట్ వాంటెడ్ క్రిమనల్సని ఆయన తెలిపారు.

వీరినుండి కరాచీ, లాహోర్ ప్రాంతాలలో దాడులు జరిపేందుకు తగిన ప్రణాళికలను రూపొందించి పత్రాలు లభ్యమైనట్లు ఆయన తెలిపారు. వీటితోపాటు వీరికి సహకరించేవారి వివరాలుకూడా దొరికినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదిలావుండగా పాక్ సైన్యం ఆ దేశ వాయువ్య ప్రాంతంలోని తాలిబన్లపై దాడులను ముమ్మరం చేసిన తర్వాత లాహోర్, పాకిస్థాన్, పెషావర్‌లాంటి ప్రముఖ పట్టణాలలో ఆత్మాహుతి దాడులు పెరిగిపోయాయి. ఇలా జరిగిన దాడులకు తామే బాద్యులమని తహరీక్-ఏ-తాలిబన్ ప్రకటించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

Show comments