Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్ షాహబ్ క్షిపణి పరీక్ష విజయవంతం

Webdunia
ఇరాన్ మిలిటరీ సోమవారం షాహబ్- 3 క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. తన చిరకాల ప్రత్యర్థి ఇజ్రాయేల్‌ను ఢీకొట్టగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉన్నాయి. ఇరాన్ మిలిటరీ గత కొన్ని గంటల్లో నిర్వహించిన రెండో క్షిపణి పరీక్ష ఇది.

ఇరాన్ వివాదాస్పద అణు కార్యక్రమంపై పశ్చిమ దేశాలు, ఐక్యరాజ్యసమితి అణు శక్తి సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

తమ దేశంలో రెండు యురేనియం శుద్ధి ప్లాంటు నిర్మిస్తున్నట్లు ఇరాన్ ఇటీవల బయటపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా సహా, ఇతర పశ్చిమ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ ఆదివారం స్వల్పదూరంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించారు.

ఇది జరిగిన కొన్ని గంటలకే ఇప్పుడు షాహబ్- 3 క్షిపణి పరీక్ష నిర్వహించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ క్షిపణి 1300- 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. దాదాపుగా అన్ని అరబ్ దేశాలు, కొన్ని యూరప్ ప్రాంతాలు, టర్కీలోని చాలా భాగం ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments