Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్: రీకౌంటింగ్‌లోనూ ఫలితాలు యథాతథం

Webdunia
ఇరాన్ ఎన్నికల సంఘం సోమవారం అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్లపై పాక్షిక రీకౌంటింగ్ జరిపింది. ఈ నెల 12న ఇరాన్‌లో జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల్లో అహ్మదీనెజాద్ విజయం సాధించడంపై ఆయన ప్రత్యర్థులు పెద్దఎత్తున్న ఆందళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ ఎన్నికల సంఘం బ్యాలెట్లపై సోమవారం పాక్షిక రీకౌంటింగ్ జరిపింది.

ఈ రీకౌంటింగ్‌లో జూన్ 12నాటి ఎన్నికలకు న్యాయబద్ధత ఉందని దేశంలో శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్ కార్యదర్శి అయతుల్లా అహ్మద్ జన్నాటీ సమక్షంలో ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకటించింది. అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్లలో పది శాతం బ్యాలెట్లను సోమవారం తిరిగి లెక్కించారు. వీటిలో ఎటువంటి అవకతవకలు బయటపడలేదని ఆ శాఖ స్పష్టం చేసింది.

నెజాద్ ఎన్నిక న్యాయబద్ధంగానే జరిగిందని తెలిపింది. ఇదిలా ఉంటే ఎన్నికల్లో అహ్మదీనెజాద్ విజయాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న ఇరాన్ మాజీ ప్రధాని మీర్ హుస్సేన్ మౌసావీ తాజా పాక్షిక రీకౌంటింగ్‌ను తోసిపుచ్చారు. ఎన్నికల్లో అసలైన విజేతను తానేనని, నెజాద్ కాదని పునరుద్ఘాటించారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

Show comments