Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరగలేదు

Webdunia
ఇరాన్‌లో శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్ ఇటీవల దేశంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేసింది. దేశంలో ఎన్నికలను పర్యవేక్షించే గార్డియన్ కౌన్సిల్ ప్రతినిధి అబ్బాసాలీ కడ్కోడాయ్ శుక్రవారం మాట్లాడుతూ.. జూన్ 12నాటి అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలేమీ జరగలేదన్నారు.

ఈ ఎన్నికల్లో అహ్మదీనెజాద్ తిరిగి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరో నాలుగేళ్లపాటు ఆయన అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగేందుకు తాజా ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు వచ్చింది. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అహ్మదీనెజాద్ రిగ్గింగ్ చేసి గెలిచారని ఆయన ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు.

అంతేకాకుండా వారు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలతో గత రెండు వారాలుగా ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో గార్డియన్ కౌన్సిల్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో అక్రమాలేమీ జరగలేదన్నారు. గత పది రోజులుగా ఎన్నికల ప్రక్రియను అబ్బాసాలీ పరిశీలించారు. తమ పరిశీలనలో అవకతవకలేవీ కనిపించలేదన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

Show comments