Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్‌లో హింసాకాండ తక్షణం నిలిపివేయాలి

Webdunia
ఇరాన్‌లో వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండను తక్షణం నిలిపివేయాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి. ఇరాన్‌లో జరుగుతున్న ఎన్నికల హింసాకాండను జి-8 దేశాల విదేశాంగ మంత్రులు ఖండించారు. ఈ హింసాకాండను తక్షణం నిలిపివేయాలని పిలుపునిచ్చారు.

ఇటలీలో శుక్రవారం జి-8 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీర్మానించిన వివరాలను ఇటలీ విదేశాంగ మంత్రి ఫ్రాంకో ఫ్రాటినీ వెల్లడించారు. ఇరాన్‌లో హింసాకాండను వెంటనే నిలిపివేయాలని జి-8 దేశాలు కోరుకుంటున్నాయని తెలిపారు. ఇరాన్ హింసాకాండ బాధితులకు సానుభూతి తెలియజేశారు.

ఇరాన్‌లో రెండు వారాల క్రితం జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికలపై ఆ దేశంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. ఈ ఆందోళన కారణంగా ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అహ్మదీనెజాద్ తిరిగి అధ్యక్ష పదవికి ఎన్నికవడంపై ఆయన ఎన్నికల ప్రత్యర్థులు ఈ ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇరాన్‌లో నెలకొన్న రాజకీయ పరిష్కారానికి శాంతియుత పరిష్కారం కనుగొనాలని జి- 8 దేశాల విదేశాంగ మంత్రులు పిలుపునిచ్చారు. ఇరాన్ ఎన్నికల హింసాకాండలో సుమారు 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

Show comments