Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్‌పై కొత్త ఆంక్షలు: అమెరికా, రష్యా దృష్టి

Webdunia
ఇరాన్ అణు వివాదాన్ని దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించాలని అమెరికా, రష్యాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే ఇరాన్ స్పందించకుండా ఉంటే కొత్త ఆంక్షలను కూడా పరిశీలించాలని నిర్ణయించాయి. రష్యా అధ్యక్షుడు ద్మిత్రీ మెద్వెదెవ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

బరాక్ ఒబామాతో జరిగిన సమావేశంలో ఇరాన్ అణు వివాదంపై పూర్తి స్థాయిలో చర్చలు జరిపానని ద్మిత్రీ మెద్వెదెవ్ వివరించారు. ఇరాన్ అణు వివాదంపై అమెరికాకు తమ సహకారాన్ని కొనసాగిస్తామని తెలిపారు. అణు శక్తిని ఇరాన్ శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించుకునేలా ఓ వ్యవస్థను రూపొందించాల్సి ఉందన్నారు. అదే సమయంలో ఆ దేశం చేతుల్లోకి అణ్వాయుధాలు చేరకుండా చూడాలనుకుంటున్నామన్నారు

ఆంక్షలు చాలా తక్కువ ఫలితాలు అందిస్తాయని, అయితే కొన్ని సమయాల్లో వాటిని తప్పించలేమని మెద్వెదెవ్ వ్యాఖ్యానించారు. ఇరాన్ అణు వివాదానికి దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో చర్చలకు కట్టుబడి ఉన్నామన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: తిరుపతిలో దేవరకొండ కింగ్‌డమ్ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

Sunny: సన్నీ లియోన్ నటించిన త్రిముఖ నుంచి ఐటెం సాంగ్ గిప్పా గిప్పా షూట్

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా సినిమా గుర్రం పాపిరెడ్డి నుంచి యోగిబాబు పోస్టర్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

Show comments