Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయేల్ నిరాయుధులను కూడా చంపింది

Webdunia
ఇజ్రాయేల్ సైనికులు ఈ ఏడాది ప్రారంభంలో 11 మంది పాలస్తీనా పౌరులను అకారణంగా చంపారని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇజ్రాయేల్ సేనలు గాజా ప్రాంతంలో పాలస్తీనా హమాస్ తిరుగుబాటుదారులపై యుద్ధం జరిపిన సంగతి తెలిసిందే.

ఈ యుద్ధం సందర్భంగా ఇజ్రాయేల్ సైనికులు తెలుపు జెండాలు పట్టుకొని నిరాయుధాలుగా వస్తున్న 11 మంది పాలస్తీనా పౌరుల ప్రాణాలు తీశారని మానవ హక్కుల సంస్థ తెలిపింది. అప్పటి మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు బాలలు ఉన్నారని వెల్లడించింది. ముగ్గురు సాక్షులను ఉటంకిస్తూ మానవ హక్కుల సంస్థ ఈ విషయాన్ని బహిర్గతం చేసింది.

ఇదిలా ఉంటే ఇజ్రాయేల్ ప్రభుత్వం మాత్రం హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి మానవ హక్కుల సంస్థలు అసమంజసంగా తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించింది. తాము పౌరులెవరినీ లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఇజ్రాయేల్ మిలిటరీ మాత్రం తాజా వార్తా కథనంపై స్పందించలేదు.

గాజా యుద్ధంపై వచ్చిన మానవ హక్కుల నివేదికలు ఎక్కువగా ఇజ్రాయేల్ ఉల్లంఘనలపై దృష్టిసారించగా, కొన్ని సంస్థలు పాలస్తీనా మిలిటెంట్లు కూడా యుద్ధ నిబంధనలను అతిక్రమించారని పేర్కొన్నాయి. ఇజ్రాయేల్ పౌరులపై హమాస్ మిలిటెంట్లు వేలాది రాకెట్లు ప్రయోగించాయని పేర్కొన్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments