Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో మరో భారతీయ విద్యార్థిపై దాడి!

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2009 (15:27 IST)
ఆస్ట్రేలియాలో జాతి వివక్ష దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో భారతీయ విద్యార్థిపై దాడి జరిగింది. మెల్‌బోర్న్‌లో 23 సంవత్సరాల యువకుడ ు చదువు కుంటూ టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఈయనపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బుధవారం దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. బర్న్స్ విక్ వెస్ట్ స్ట్రీట్‌లో ఈ దాడి జరిగిందని చెప్పారు. కోలియర్ క్రెస్కెంట్‌కు చెందిన తన గర్ల్‌ఫ్రెండ్ ఇంటి ముందు టాక్సీని పార్కింగ్ చేసి వెళుతుండగా, గుర్తు తెలియని వ్యక్తులు బాధితునిపై వేకువ జామున ఈ దాడి జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.

ఈ దాడితో ఖంగుతిన్న గర్ల్‌ఫ్రెండ్ కేకలు పెట్టిందని, దీంతో అక్కడ ఉన్నవారు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో దుండగులు పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. అయితే, జాతి వివక్ష లేదా దోపిడీ చేసేందుకే ఈ దాడి జరిగినట్టు పోలీసులు భావించడం లేదు. బాధితుని చేతిలో ఉన్న డబ్బులతో పాటు.. మొబైల్ ఫోన్ కూడా ఉందని చెప్పారు.

ఈ దాడి ఘటనలో మరోకారు డ్రైవర్ ప్రమేయం ఉందా లేదా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గత యేడాది జూన్ నెల వరకు ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో సుమారు 30 మంది భారతీయులపై దాడులు జరిగిన విషయం తెల్సిందే. వీటిలో ఎక్కువ భాగం జాతివవక్షతో జరుగగా, మరికొన్ని దోపిడీ దాడులు కావడం గమనార్హం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments