Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో మరో భారతీయుడిపై దాడి

Webdunia
ఆస్ట్రేలియా ప్రభుత్వం భారతీయులకు భద్రత కాల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికి కూడా ఆ దేశంలో మనవారిపై దాడులు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ఇటీవల కాలంలో భారతీయులపై వరుసగా జాత్యహంకార దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటువంటి దాడులను ఉపేక్షించబోమని, భారతీయలకు భద్రత కల్పిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం హామీ ఇచ్చింది.

అయితే తాజాగా మరో భారతీయ విద్యార్థిపై దాడి జరిగింది. హర్యానాకు చెందిన ఓ విద్యార్థిపై శుక్రవారం మెల్‌బోర్న్‌లో కొందరు యువకులు దాడి చేశారు. గడిచిన నెల రోజుల్లో భారతీయులపై జరిగిన పదో దాడి ఇది. హర్యానాకు చెందిన అమృత్ పాల్ సింగ్ అనే 20 ఏళ్ల యువకుడిపై తాజా దాడి జరిగింది. నగరంలోని కాప్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో అమృత్ కమ్యూనిటీ వెల్ఫేర్ కోర్సు చదువుతున్నాడు.

అతడిపై కళాశాలకు సమీపంలోని మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్ వద్ద యువకులు దాడి చేశారు. పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసే ప్రదేశానికి నడిచి వెళుతున్న తన వద్ద నుంచి ఓ వ్యక్తి మొబైల్‌ను బలవంతంగా తీసుకున్నాడని అమృత్ తెలిపాడు. తన మొబైల్ తిరిగి ఇవ్వాలని అడిగా. వెంటనే నా ముఖంపై కొట్టాడు. నేను కూడా తిరగబడ్డాను.

ఆపై ఆ యువకుడు, అతని నలుగురు స్నేహితులు తనపై దాడి చేశారని అమృత్ పాల్ సింగ్ తెలిపాడు. జరిగిన విషయాన్ని తాను పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లాలని వెల్లడించాడు. దాడి చేసిన వ్యక్తుల్లో ఒకరు కత్తిని కూడా తీసుకున్నాడని, అయితే అది తన బ్యాగుకు తగలడంతో తప్పించుకున్నానని అమృత్ చెప్పాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments