ఆస్ట్రేలియాలో వలసలు, విద్యా కుంభకోణాలను బయటపెట్టేందుకు రహస్య విధులపై అక్కడికి వెళ్లిన ఓ యువ భారతీయ జర్నలిస్ట్‌పై దాడి జరిగింది. భారత్‌తోపాటు, ఇతర దేశాల నుంచి వెళ్లిన అంతర్జాతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో జరుగుతున్న విద్యా కుంభకోణాల బాధితులవుతున్నారు.
ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితులను తెలుసుకునేందుకు ఏబీసీ టీవీతో పనిచేస్తున్న ఓ యువ మహిళా జర్నలిస్ట్ ఆస్ట్రేలియా వెళ్లారు. ఫోర్ కార్నర్స్ అనే కార్యక్రమం కోసం పనిచేస్తున్న ఆమెకు గతవారం బెదిరింపులు వచ్చాయి. అంతేకాకుండా వారాంతపు రోజుల్లో ఆమెపై దాడి కూడా జరిగింది.
భారతీయ విద్యార్థులపై ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా నగరాల్లో వరుసగా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జర్నలిస్ట్‌పై కూడా దాడి జరగడం చర్చనీయాంశమైంది. ఏబీసీతో రిపోర్టర్‌గా పనిచేస్తున్న మహిళా జర్నలిస్ట్‌పై దాడి వెనుక మైగ్రేషన్ ఏజెంట్లు లేదా ఫోర్ కార్నర్స్ కోసం ఆమె చూపించిన కళాశాల ఈ దాడికి కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.