Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియాతో పటిష్ట బంధంపై అమెరికా దృష్టి

Webdunia
అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఆసియా ఖండంలో రెండోసారి పర్యటిస్తున్న హిల్లరీ క్లింటన్ అమెరికా గత పోకడలను పక్కనబెట్టి సరికొత్త పంథాలో ముందుకెళుతున్నారు. గతంలో అమెరికా నేతలకు తమ ఉద్దేశాలను ఎలాగైనా ఇతర దేశాలపై రుద్దడం అలవాటుగా ఉండేది. అమెరికాతో సంబంధాలు గతంలో దాదాపుగా ఏకపక్షంగా సాగేవనడం కూడా అతిశయోక్తి కాదు.

దీనికి భిన్నంగా ప్రస్తుతం హిల్లరీ క్లింటన్ పర్యటన సాగుతోంది. హిల్లరీ క్లింటన్ థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ చేరుకున్న సందర్భంగా మాట్లాడుతూ.. ఆసియాలో అమెరికా మళ్లీ అడుగుపెట్టిందని వ్యాఖ్యానించారు. థాయ్ పర్యటనలో ఆమె ఉత్తర కొరియా, మయన్మార్ పరిస్థితులపై జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడంతోపాటు, ఇతర ప్రాంతీయ అంశాలపై చర్చలు జరుపుతారు.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారిక యంత్రాంగం ఆసియా దేశాలపై పటిష్ట బంధాన్ని నెలకొల్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాల కారణంగా ఆసియా దేశాలు తమకు దూరం కాకుండా ఉండేందుకు దౌత్యమార్గం ద్వారా ప్రయత్నాలు చేపట్టింది. ఆసియా ప్రాంతంతో భాగస్వామ్యాన్ని మరింత లోతుల్లోకి తీసుకెళ్లాలని అమెరికా కోరుకుంటున్నట్లు హిల్లరీ తాజా పర్యటనలో విస్పష్టంగా చెబుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?