Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘన్- పాక్ పర్యటనకు రిచర్డ్ హోల్‌బ్రూక్

Webdunia
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లకు అమెరికా ప్రత్యేక రాయబారిగా వ్యవహరిస్తున్న రిచర్డ్ హోల్‌బ్రూక్ మరోసారి దక్షిణాసియా పర్యటనకు వస్తున్నారు. గత నెల రోజుల్లో దక్షిణాసియా దేశాల్లో హోల్‌బ్రూక్ పర్యటించడం ఇది రెండోసారి. గత పర్యటనలోనూ భారత్‌కు దూరంగా ఉన్న హోల్‌బ్రూక్ ఈసారి కూడా భారత పర్యటనకు వచ్చే అవకాశం కనిపించడం లేదు.

ఈసారి కూడా ఆయన ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లోనే పర్యటించనున్నారు. శుక్రవారం పాకిస్థాన్ పర్యటనకు రానున్న హోల్‌బ్రూక్ అనంతరం ఆఫ్ఘనిస్థాన్ వెళతారు. అనంతరం టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగే ఓ సమావేశానికి ఆయన హాజరవతారు.

అమెరికా విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ గత నెలలో భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన తరువాత హోల్‌బ్రూక్ భారత్‌కు రావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఈ పర్యటన వాయిదా పడింది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల పర్యటన సందర్భంగా భారత్ వెళ్లే ప్రణాళికలేవీ లేవని హోల్‌బ్రూక్ అమెరికా అధికారులతో బుధవారం చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments