Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘన్- పాక్‌పై అంతర్జాతీయ చర్చలకు పిలుపు

Webdunia
ఇటలీలో గురువారం ప్రారంభం కాబోతున్న జి8 సమావేశాల్లో భాగంగా పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితులపై అంతర్జాతీయ సదస్సుకు భారత్ పిలుపునిచ్చింది. ఇటలీలోని ట్రియస్టేలో మూడు రోజులపాటు జి8 పారిశ్రామిక దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాలు జరుగుతాయి. ఇందులో భారత్‌తోపాటు, ప్రధాన పారిశ్రామిక దేశాలు పాల్గొంటాయి.

ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్థాన్- పాకిస్థాన్ పరిస్థితులపై చర్చలు జరపాలని భారత్‌తోపాటు వివిధ దేశాలు పిలుపునిచ్చాయి. ఈ చర్చలకు ఇరాన్‌ను కూడా ఆహ్వానించాయి. అయితే దీనిపై ఇరాన్ ఇప్పటివరకు స్పందించలేదు. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లలో అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న ఉమ్మడి సవాళ్లపై ఈ సదస్సులో భాగంగా ప్రపంచదేశాలు చర్చలు జరపాలనుకుంటున్నాయి.

ఈ చర్చల ద్వారా పాకిస్థాన్ నుంచి భారత్ ఏం కోరుకుంటుందనే దానిపై స్పందించేందుకు పైవివరాలు వెల్లడించిన అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నిరాకరించారు. ఆఫ్ఘనిస్థాన్ పునర్నిర్మానంలో భారత్ పాత్ర అందరికీ తెలిసిందేనని, భారత ప్రభుత్వం ఆఫ్ఘన్‌లో భారీస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. ఇటలీలో జి8 విదేశాంగ మంత్రుల సమావేశంలో భాగంగా ఆఫ్ఘన్- పాక్‌లపై చర్చలు జరుగుతాయని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

Show comments