Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘన్‌లో ముంబయి దాడుల సుత్రధారులు

Webdunia
26 /11, 9/11 ఉగ్రవాద దాడులకు కుట్రపన్నిన సూత్రధారులు తమ దేశంలో ఉన్నారని అమెరికా నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని పాకిస్థాన్ ప్రభుత్వం ఆగ్రహం చేసింది. అమెరికా, భారత్‌లలో జరిగిన ఉగ్రవాద దాడుల సూత్రధారులు తమ దేశంలో నివసించడం లేదని స్పష్టం చేసింది.

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ న్యూయార్క్‌లో 2001, సెప్టెంబరు 11, ముంబయిలో నవంబరు 26, 2008న జరిగిన ఉగ్రవాద దాడుల సూత్రధారులు పాకిస్థాన్‌లో ఉన్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ.. ఈ దాడుల సుత్రధారులు పాకిస్థాన్‌లో లేరని స్పష్టం చేశారు.

వారు ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నారని బాసిత్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆదివారం హిల్లరీ క్లింటన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవన్నారు. అంతకుముందు హిల్లరీ క్లింటన్ ముంబయి ఉగ్రవాద దాడులకు బాధ్యులైనవారిపై పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తీవ్రవాదాన్ని ప్రధాన సమస్యగా వర్ణించారు. ఇది ప్రపంచ శాంతికి ముప్పుగా మారిందన్నారు.

ఈ నేపథ్యంలో బాసిత్ మాట్లాడుతూ.. ముంబయి ఉగ్రవాద దాడులపై పాకిస్థాన్ ప్రభుత్వం ఓ క్రమపద్దతిలో దర్యాప్తును ముందుకు తీసుకెళుతుందని, ఈ విషయంలో తమ నిబద్ధతను ఏమాత్రం సంశయించరాదన్నారు. పాకిస్థాన్ నిఘా సంస్థలు దర్యాప్తును పకడ్బందీగా జరుపుతున్నాయని బాసిత్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Show comments