Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘన్‌లో బాంబు దాడి: 11 మంది మృతి

Webdunia
ఆఫ్ఘనిస్థాన్‌లో శుక్రవారం జరిగిన బాంబు దాడిలో 11 మంది అమాయక పౌరులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు బాలలు కూడా ఉన్నారని సరిహద్దు పోలీసు అధికారులు తెలిపారు. దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లో రోడ్డుపక్కన అమర్చిన బాంబు పేల్చడంతో బాధితులు ప్రయాణిస్తున్న వాహనం ధ్వంసమైంది. ఇదిలా ఉంటే మరో బాంబు పేలుడులో బ్రిటన్ సైనికుడొకరు మృతి చెందారు.

కాందహార్ ప్రావీన్స్‌లోని స్పిన్ బోల్డాక్ జిల్లాలో కొంత మంది యాత్రికులు వాహనంలో ప్రార్థనా స్థలానికి వెళుతుండగా బాంబు పేలుడు సంభవించింది. ఈ బాంబు పేలుడుకు తాలిబాన్ తీవ్రవాదులే కారణమని అధికారిక వర్గాలు ఆరోపించాయి.

ఆఫ్ఘనిస్థాన్, విదేశీ సేనలను లక్ష్యంగా చేసుకునేందుకు తీవ్రవాదులు తరచుగా మందుపాతరలతో దాడులకు పాల్పడుతుంటారు. తాజా దాడికి కూడా వారే కారణమయి ఉంటారని అధికారులు తెలిపారు. దాడిలో మరో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. ఈ ఏడాది దేశంలో ఇటువంటి దాడులు గణనీయంగా పెరిగాయని ఆఫ్ఘన్ అధికారులు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Show comments