Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా సేనల చీఫ్ మెక్‌క్రిస్టల్

Webdunia
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులతో గత కొన్నేళ్లుగా పోరాడుతున్న అమెరికా సైన్యానికి కొత్త అధిపతిగా జనరల్ స్టాన్లీ మెక్‌క్రిస్టల్ నియమితులయ్యారు. అమెరికా, నాటో సేనలకు ఇకపై ఆయన నేతృత్వం వహించనున్నారు.

కాబూల్‌లో సోమవారం ఎటువంటి ఆర్భాటం లేకుండా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రస్తుత దళాధిపతి జనరల్ డేవిడ్ మెక్‌కీర్నాన్ నుంచి మెక్‌క్రిస్టల్ ఈ బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక దళాల మాజీ కమాండర్‌గా బాధ్యతలు నిర్వహించిన మెక్‌క్రిస్టల్ ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాన్ని మరింత సాంప్రదాయేతర మార్గంలోకి తీసుకెళతారని నిపుణులు భావిస్తున్నారు.

2001 లో ఆప్ఘనిస్థాన్‌లో తీవ్రవాదులపై యుద్ధం ప్రకటించిన అమెరికా, నాటో సేనలు ఇప్పటివరకు అక్కడ నానాటికీ పెరుగుతున్న హింసాకాండను నియంత్రించలేకపోయాయి. ప్రస్తుతం ఆఫ్ఘన్ యుద్ధ రంగంలో 56 వేల మంది అమెరికా సైనికులు, 32 వేల మంది ఇతర దేశాల సైనికులు ఉన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments