Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్గన్‌లో నాటో దళాల సమయం పొడిగించిన ఐరాస

Webdunia
ఆఫ్గనిస్థాన్‌ దేశంలో నాటో భద్రతాదళాల సమయాన్ని ఒక సంవత్సరంపాటు పొడిగించినట్లు ఐక్యరాజ్య సమితి శుక్రవారం ప్రకటించింది.

ఆఫ్గనిస్థాన్ దేశంలో జరుగుతున్న దురాగతాలను అరికట్టేందుకుగాను ఐరాస దాదాపు 70 వేలమంది నాటో భద్రతా దళాలను మొహరింపజేసింది. వీరికి మరింత సమయం పెంచుతూ వచ్చే ఏడాది వరకు పొడిగించినట్లు బ్రిటన్‌కు చెందిన ఐరాస దౌత్యాధికారి జాన్ సావేర్స్ శుక్రవారం తెలిపారు.

ఐరాస సభ్యులు ఈ విషయంపై ప్రత్యేకంగా చర్చించి నాటో భద్రతాదళాల సమయాన్ని ఆఫ్గనిస్థాన్ దేశంలో ఓ సంవత్సరం పాటు పొడిగించాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఆఫ్గన్ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో మద్దతు తెలపాలని 15 మంది సభ్యులతో కూడిన బృందం పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు.

ఇదిలావుండగా ప్రస్తుతం ఆ దేశంలో దాదాపు 70 వేలమంది నాటో భద్రతాదళాలున్నాయి. వీరిని కుదిస్తారా లేదా అనే విషయంపై స్పష్టమైన చర్చ జరగలేదని ఆయన అన్నారు. ఐరాస తెలిపిన మద్దతుకు అమెరికా అధ్యక్షుడు ఒబామా ఈ వారంలో మద్దతు తెలుపుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా ప్రస్తుతం అమెరికాకు చెందిన భద్రతా బలగాలు 65 వేలమంది ఆఫ్గనిస్థాన్ దేశంలో నాటో భద్రతాదళాలతో కలిసి భద్రతను చేపట్టాయని, మరో 34 వేలమంది అమెరికా ఆధీనంలో పనిచేస్తున్నాయని ఆయన వెల్లడించారు.

ఆఫ్గనిస్థాన్ దేశంలో పరిస్థితిని చక్కబెట్టేందుకు వాషింగ్‌టన్‌లో ప్రత్యేకమైన చర్చలు కొనసాగుతున్నాయని, ఆ దేశంలో వేళ్ళూనుకొనివున్న తీవ్రవాదాన్ని మట్టుబెట్టేందుకు అన్ని దేశాలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయని ఆయన తెలిపారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments