Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్గన్‌కు మరో 13 వేల అమెరికా సేనలు : బరాక్ ఒబామా

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2009 (09:24 IST)
ఆఫ్గనిస్థాన్‌లో తిష్టవేసిన తాలిబన్ ఉగ్రవాదుల పని పట్టేందుకు గాను అమెరికా అదనపు బలగాలను పంపాలని నిర్ణయించింది. ఇందుకోసం మరో 13 వేల మంది సైనిక బలగాలను పంపేందుకు ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా సమ్మతించారు.

ఆఫ్గన్‌కు మరో 21 వేల మంది దళాలను పంపుతామని గత మార్చి నెలలో ఆయన ఓ ప్రకటన చేశారు. ఈ సంఖ్యకంటే తక్కువగా దళాలను పంపేందుకు అనుమతి ఇవ్వడం గమనార్హం. ఈ విషయాన్ని వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక వెల్లడించింది. ఈ అదనపు దళాలు ప్రధానంగా సహకార దళాలుగా ఉంటాయి. అంటే ఇంజనీర్లు, వైద్య సిబ్బంది, ఇంటెలిజెన్స్‌ నిపుణులు, సైనిక పోలీసులు ఉంటారని పోస్ట్‌ పేర్కొంది.

దీంతో ఆఫ్ఘన్‌కు పంపేందుకు ఒబామా ధ్రువీకరించిన అమెరికా దళాల సంఖ్య 34 వేలకు చేరుకుంటుంది. సాధారణంగా పెంటగాన్‌, వైట్‌హౌస్‌ మద్దతు దళాల మోహరింపును బహిరంగంగా ప్రకటించదు. మాజీ అధ్యక్షుడు బుష్‌ ఇరాక్‌కు పంపిన 20 వేల పోరాట దళాలను గురించి మాత్రమే ప్రకటించారు. వారి వెంట వెళ్లిన మద్దతు దళాల సంఖ్యను వెల్లడించని విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments