Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్గనిస్థాన్‌లో పరిస్థితి దిగజారుతోంది: హిల్లరీ

Webdunia
ఆఫ్గనిస్థాన్‌లో పరిస్థితి మరింతగా దిగజారుతోందని దీనిని తాలిబన్లు లాభపడుతున్నారని అమెరికా భావిస్తోంది.

ప్రస్తుతం ఆఫ్గనిస్థాన్ దేశంలో పరిస్థితి మరింతగా దిగజారుతోందని అమెరికా విదేశాంగ శాఖామంత్రిణి హిల్లరీ క్లింటన్ అమెరికా సెనేట్‌‌కు వివరించారు.

అక్కడ పరిస్థితి దిగజారడంతో తాలిబన్ ఉగ్రవాదులు దానిని వారికి అనుగుణంగా మలుచుకుంటున్నారని ఆమె తెలిపారు.

ప్రస్తుతం తాలిబన్లు ఆఫ్గన్ ప్రాంతంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని, జనరల్ మైక్‌క్రిస్టల్ పంపిన సమాచారంతో తాము ఏకీభవిస్తున్నట్లు ఆమె అన్నారు.

ఇదిలావుండగా ఇటీవల జనరల్ మైక్‌క్రిస్టల్ అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామాకు పంపిన నివేదికలోను ఇదే విషయాన్ని వివరించారని, అక్కడి పరిస్థితి మరింతగా దిగజారుతోందని తన నివేదికలో వివరించారు.

కాగా ఆఫ్గనిస్థాన్‌కు ప్రత్యేకంగా నలభైవేల మంది అదనపు సైనిక బలగాలను పంపాలని కూడా ఆయన అమెరికా అధ్యక్షుడిని కోరినట్లు ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిపారు. దీంతో అక్కడ ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు వీలవుతుందని కూడా తన నివేదికలో తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments