Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్ ఖైదా నేతల హత్యకు సీఐఏ ఆపరేషన్

Webdunia
అల్ ఖైదా తీవ్రవాద నేతలను బంధించేందుకు, ఇది కుదరని పక్షంలో వారిని హతమార్చేందుకు అమెరికాకు చెందిన కేంద్ర నిఘా సంస్థ (సీఐఏ) ఓ రహస్య ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌ను సీఐఏ డైరెక్టర్ గత నెలలోనే నిలిపివేశారు. ఓ వార్తాపత్రిక సోమవారం వెల్లడించిన కథనం ప్రకారం.. సెప్టెంబరు 11, 2001న న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాద దాడి జరిగిన అనంతరం అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ ఆదేశాలపై సీఐఏ ఈ రహస్య ఆపరేషన్ చేపట్టారు.

ఈ ఆపరేషన్ కార్యకలాపాల వివరాలు మాత్రం వెల్లడికాలేదు. ఈ రహస్య ఆపరేషన్‌ను సీఐఏ గత నెలలో నిలిపివేసిందని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్‌తో నిఘా అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం సీఐఏ నిధులు వెచ్చించడంతోపాటు, శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టింది. అయితే దీనికి సంబంధించిన ప్రణాళికలు మాత్రం పూర్తిస్థాయిలో అమలు కాలేదు.

దీనిని జూన్‌లో సీఏఐ డైరెక్టర్ లియోన్ పానెట్టా నిలిపివేశారు. అల్ ఖైదా నేతలను హతమార్చేందుకు చేపట్టిన రహస్య ఆపరేషన్ వివరాలను బుష్ పాలనా యంత్రాంగం అమెరికా కాంగ్రెస్‌‍కు తెలియజేయలేదు. అమెరికా చట్టాల ప్రకారం దీనికి సంబంధించిన వివరాలు కాంగ్రెస్ ముందుంచాల్సి ఉంది. రహస్య ఆపరేషన్ గురించి ప్రస్తుత సీఐఏ డైరెక్టర్ పానెట్టా జూన్ 23న తెలుసుకున్నారు. ఆ వెంటనే ఈ ఆపరేషన్ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!