Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జెంటీనాలో మూడు స్వైన్ ఫ్లూ మరణాలు

Webdunia
స్వైన్ ఫ్లూ వైరస్ కారణంగా తమ దేశంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని ఆర్జెంటీనా ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో అర్జెంటీనాలో ఈ వ్యాధి కారణంగా మృతి చెందినవారి సంఖ్య నాలుగుకి చేరింది. ఏ(హెచ్1ఎన్1) వైరస్ గత కొన్ని నెలలుగా ప్రపంచదేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 160 మందికిపైగా మృతి చెందారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా అర్జెంటీనాలో మరో ముగ్గురు వ్యక్తులు స్వైన్ ఫ్లూతో మరణించారు. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ ప్రావీన్స్‌లో ఇద్దరు పౌరులు మృతి చెందగా, మరోకరు అర్జెంటీనా రాజధానిలోనే మృతి చెందారు.

అంతకుముందు సోమవారం మూడేళ్ల శిశువు స్వైన్ ఫ్లూ వ్యాధి కారణంగా మృతి చెందినట్లు అర్జెంటీనా అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉంటే అర్జెంటీనాలో కొత్తగా 138 స్వైన్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఈ దేశంలో మొత్తం స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తుల సంఖ్య 871కి చేరింది. దక్షిణ అమెరికా ఖండంలో స్వైన్ ఫ్లూ జాడలు ఎక్కువగా కనిపిస్తున్న రెండో దేశం అర్జెంటీనా కాగా, చిలీలో అత్యధికంగా 2335 స్వైన్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments