Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా స్థావరంపై దాడికి అల్ ఖైదా కుట్ర

Webdunia
కువైట్‌‍లోని అమెరికా సైనిక స్థావరంపై అనుమానిత అల్ ఖైదా తీవ్రవాదులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ దాడి కుట్రను కువైట్ భద్రతా యంత్రాంగం భగ్నం చేసింది. దీనికి సంబంధించి ఆరుగురు తమ దేశ పౌరులను అరెస్టు చేసినట్లు కువైట్ అధికారులు వెల్లడించారు.

తమ దేశంలో అమెరికా స్థావరంపై దాడికి ప్రయత్నం జరిగిందని, అయితే దానిని తాము భగ్నం చేశామని కువైట్ అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. అరెస్టు చేసిన ఆరుగురు కువైట్ పౌరులు అమెరికా స్థావరంతోపాటు, ప్రభుత్వ భద్రతా కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాలపై దాడులకు కూడా కుట్రపన్నినట్లు పేర్కొంది.

కువైట్‌లో సుమారు 15 వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. పొరుగునున్న ఇరాక్‌లో భద్రతా విధులు నిర్వహించేందుకు అమెరికా సైనికులు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. కువైట్‌లోని అరిఫ్‌జాన్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరంపై దాడికి కుట్ర పన్నామని అరెస్ట్ అయిన తీవ్రవాదులు అంగీకరించారు. ఈ స్థావరం కువైట్ రాజధానికి సమీపంలో ఉంది. దీనికి సౌదీ అరేబియా దేశ సరిహద్దులు కూడా సమీపంలోనే ఉన్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments