Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా సబ్‌వే ప్రమాదం: ఆరుగురి మృతి

Webdunia
అమెరికాలో సోమవారం రెండు సబ్‌వే మెట్రో రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 70 మంది గాయపడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి. వాషింగ్టన్- మేరీలాండ్ రాష్ట్రాల సరిహద్దుకు సమీపంలోని రైల్వే మార్గంపై సోమవారం అంతర్జాతీయ కాలమానం ప్రకారం 2100 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

రెండు స్టేషన్ల మధ్య నిలిచిపోయిన రైలును వెనుక వచ్చిన మరో రైలు ఢీకొట్టిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో రెండు రైళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మృతి చెందినవారిలో వెనుక నుంచి రైలును ఢీకొట్టిన రెండో రైలు డ్రైవర్ కూడా ఉన్నాడు. ప్రమాదంలో రెండో రైలు డ్రైవర్ కంపార్ట్‌మెంట్ పూర్తిగా ధ్వంసమైంది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంది. గాయపడిన 70 మందిలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు అధికారిక వర్గాలు దర్యాప్తు చేపట్టాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments