Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా డ్రోన్ దాడి: 12 మంది తాలిబాన్ల హతం

Webdunia
అమెరికా దళాలు మరోసారి పాకిస్థాన్ భూభాగంలోని తీవ్రవాద స్థావరాలపై విరుచుకపడ్డాయి. తాజాగా అమెరికా జరిపిన డ్రోన్ (మానవరహిత యుద్ధ విమానం) దాడిలో 12 మంది తాలిబాన్ తీవ్రవాదులు హతమయ్యారు. చట్టపాలన లేని పాకిస్థాన్‌లోని సమస్యాత్మక వాయువ్య ప్రాంతంలో తలదాచుకుంటున్న తాలిబాన్, అల్ ఖైదా తీవ్రవాదులపై అమెరికా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.

పాకిస్థాన్ ప్రభుత్వం తమ భూభాగంలో విదేశీ సేనల దాడులను ఖండిస్తున్నప్పటికీ, అమెరికా దళాలు తరచుగా డ్రోన్ దాడులు చేస్తూనే ఉన్నాయి. తాజాగా అమెరికా దళాలు వాయువ్య ప్రాంతంలోని దక్షిణ వజీరిస్థాన్‌లో స్థానిక తాలిబాన్ కమాండర్ ఇర్ఫాన్ మెహసూద్ ఇంటిపై డ్రోన్ దాడి చేశాయి.

ఈ దాడిలో 12 మంది తీవ్రవాదులు హతమైనట్లు, మరో ఎనిమిది మంది గాయపడినట్లు మీడియా వెల్లడించింది. గడిచిన నెల రోజుల్లో దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతంలో అమెరికా దళాలు డ్రోన్ దాడి చేయడం ఇది ఐదోసారి. ఇదిలా ఉంటే ఇదే ప్రాంతంలో పాకిస్థాన్ దళాలు ఇద్దరు తాలిబాన్ కమాండర్లతోపాటు, మొత్తం 28 మంది తీవ్రవాదులను అరెస్టు చేశాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments