Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో రెండో అతిపెద్ద హిమపాతం: భారీ నష్టం!

Webdunia
అమెరికాను హిమపాతం ముంచెత్తుతోంది. ఆ దేశ చరిత్రలోనే రెండో అతిపెద్ద మంచు తుఫానుగా నమోదైంది. దీంతో యూఎస్ ఈస్ట్ కోస్ట్ ప్రాంతాన్ని పూర్తిగా మంచు దుప్పటి కప్పేసింది. ఈ మంచు ఏకంగా 14 అంగుళాలు (36 సెంమీ) మేరకు పేరుకుని పోయినట్టు స్థానిక వాతావరణ అధికారులు వెల్లడించారు.

వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్ వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో బుధవారం అమెరికాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేశారు. వరుసగా మూడో రోజు కురుస్తున్న ఈ హిమపాతం కారణంగా రోజుకు వంద మిలియన్ డాలర్ల మేరకు ఉత్పత్తి నష్టపోతున్నట్టు అధికారులు తెలిపారు.

అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో బుధవారం రాత్రికి మంచు 14 అంగుళాల మేరకు పేరుకుని పోవచ్చని ఆ దేశ జాతీయ వాతావరణ సంస్థ అంచనా వేసింది. దీంతో బుధవారం న్యూయార్క్ హెడ్ క్వార్టర్‌ను మూసి వేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది.

వాషింగ్టన్, న్యూయార్క్‌లలో 36 సెంటీమీటర్లు, ఫిలడెల్ఫియాలో 48 సెం.మీ చొప్పున మంచు పేరుకుంటుంది నేషనల్ వెదర్ సర్వీస్ అంచనా వేసింది. ఈ కారణంగా వాషింగ్టన్‌లోని ఫెడరల్ ఏజెన్సీలను మూసి వేస్తున్నట్టు ఆఫీస్ ఆఫ్ పర్సనర్ మేనేజ్‌మెంట్ బుధవారం ప్రకటంచింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments