Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాకు ధీటుగా సమాధానమిస్తాం: రష్యా

Webdunia
అంతరిక్షాన్ని మిలిటరీ అవసరాలకు ఉపయోగించుకునేందుకు అమెరికా సంయుక్త రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలపై రష్యా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా అంతరిక్ష సైనికీకరణకు ధీటైన సమాధానమిచ్చే సామర్థ్యం రష్యా కలిగివుందని రష్యా రక్షణ శాఖ సహాయమంత్రి వ్లాదిమీర్ పొపోవ్కిన్ పేర్కొన్నారు.

అమెరికా ఆయుధాలను అంతరిక్షంలో మోహరించిన పక్షంలో.. దానికి సరైన సమాధామిచ్చే సత్తా రష్యాకు ఉందన్నారు. దీనికి రష్యా కూడా అంతరిక్షంలో ఆయుధాలు మోహరించాల్సిన అవసరం లేదు. ఇటువంటి సమాధానం పూర్తిగా సరికాదని పొపోవ్కిన్ తెలిపారు. అంతరిక్ష యుద్ధాలకు దారితీసే విధంగా ఆయుధాలను నింగిలో మోహరించే ముందు, అక్కడి వాటి అవసరం ఏముందో ఆలోచించాలన్నారు.

" స్టార్ వార్స్" సీజన్, దాని ముగింపు అమెరికా, సోవియట్ యూనియన్‌లకు తెలిసిందే. అంతరిక్షంలో కొన్ని దశాబ్దాల క్రితం పోటాపోటీగా ఈ రెండు దేశాలు ఉపగ్రహ ప్రయోగాలు నిర్వహించాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత ఇరుదేశాల మధ్య అంతరిక్ష యుద్ధానికి తెరపడింది.

తాజాగా అమెరికా అంతరిక్ష సైనికీకరణ విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది. అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాన్ని కూల్చివేయడంలో తమకు ఎటువంటి సమస్యలులేవని, తమకు ఆ సత్తా ఉందని రష్యా మిలిటరీ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. ఇటీవల చైనా కూడా అంతరిక్షంలో ఉపగ్రహాన్ని కూల్చివేసి సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments