Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్డెల్‌బసెత్ విడుదలకు స్కాట్లాండ్ సమర్థన

Webdunia
లాకర్‌బీ బాంబర్ విడుదల చేస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్కాట్లాండ్ మంత్రి ఒకరు గట్టిగా సమర్థించారు. అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చీఫ్ రాబర్ట్ బుల్లెర్ లాకర్‌బీ బాంబర్ అబ్డెల్‌‍బసెత్‌ను స్కాట్లాండ్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు.

ఈ నేపథ్యంలో.. స్కాట్లాండ్ మంత్రి అలక్స్ సాల్మండ్ మాట్లాడుతూ.. అబ్డెల్‌బసెత్‌ను విడుదల చేస్తూ తాము తీసుకున్న నిర్ణయం సబబేనని సమర్థించుకున్నారు. ఈ నిర్ణయం కారణంగా అమెరికా- స్కాట్లాండ్ సంబంధాలేవీ దెబ్బతినవన్నారు. ఇటీవల స్కాట్లాండ్ న్యాయ శాఖ సంచలనాత్మక లాకర్‌బీ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అబ్డెల్‌బసెత్ అలీ మొహ్మెత్ అల్ మెగ్రాహీని విడుదల చేసిన సంగతి తెలిసిందే.

కేన్సర్‌తో బాధపడుతున్న మెగ్రాహీకి క్షమాభిక్ష ప్రసాదిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఎఫ్‌‍బీఐ చీఫ్ ముల్లెర్ తప్పుబట్టారు. స్కాట్లాండ్ న్యాయ శాఖకు తీవ్ర పదజాలంతో ఓ లేఖ కూడా రాశారు. తీవ్రవాద ప్రపంచానికి దీనిని అనుకూల నిర్ణయంగా అభివర్ణించారు. అయితే ఎఫ్‌బీఐ చీఫ్ అభిప్రాయాలతో స్కాట్లాండ్ మంత్రి అలెక్స్ సాల్మండ్ విభేదించారు.

అమెరికాలోని వ్యక్తులు కొన్ని సమయాల్లో తమ న్యాయవ్యవస్థను అర్థం చేసుకోలేరు. తమదొక విభిన్నమైన న్యాయవ్యవస్థ. స్కాట్లాండ్ చట్టాల ప్రకారం తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సాల్మండ్ స్కై న్యూస్‌తో చెప్పారు. మెగ్రాహీ విడుదలపై స్కాట్లాండ్‌ను, దాని ఉత్పత్తులను బహిష్కరించాలని ఓ వెబ్‌సైట్ ఇచ్చిన పిలుపును కూడా తిరస్కరించారు.

1988 లో పాన్ అమెరికా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని స్కాట్లాండ్‌లోని ఓ పట్టణంపై వెళుతుండగా పేల్చివేశారు. ఇందులో 270 మంది పౌరులు మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది అమెరికన్లు ఉన్నారు. ఈ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న మెగ్రాహీని ఇటీవల స్కాట్లాండ్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించి విడిచిపెట్టింది. దీనిపై అమెరికా ప్రభుత్వం నిరసన వ్యక్తం చేస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments