Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానితులను పట్టుకున్నాం: పోలీసులు

Webdunia
రావల్పిండిలోనున్న పాక్ సైనిక ప్రధాన కార్యాలయంపై తాలిబన్లు దాడులకు పాల్పడిన నాలుగు రోజుల తర్వాత గత రెండు రోజులుగా భద్రతా బలగాలు దాదాపు నలభైమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

పాక్‌లోని పంజాబ్ రాష్ట్రం రాజధాని లాహోర్‌లో పోలీసులు 40 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీరిలో లుక్మాన్ అనే వ్యక్తి వద్ద ఆత్మాహుతి చేసుకునేందుకు వాడే జాకెట్ లభించిందని పోలీసులు తెలిపారు.

వీరు దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు సిద్ధమైనారని, అందులో భాగంగానే వీరిని తాము అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. తాము అదుపులోకి తీసుకున్న నలభైమంది అనుమానితులు లష్కర్-ఏ-ఝాంగవీ, సిపాహ్-ఏ-సాహబ్, సిపాహ్-ఏ-ముహమ్మద్, జైష్-ఏ-మొహమ్మద్‌లాంటి తీవ్రవాద సంస్థలకు చెందిన వారని, వీరంతా కూడా పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

వీరిలో లుక్మాన్ అనే అనుమానితుడిని పాక్ వాయువ్య సరిహద్దు ప్రాంతానికి 75 కిలోమీటర్ల దూరంలోనున్న 16వ చెక్‌పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. లుక్మాన్‌కు అకీల్ అలియాస్ డాక్టర్. ఉస్మాన్‌తో సత్సంబంధాలున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments