Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిని అందంగా అలంకరించడమూ ఓ కళే.. ఎలా?

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2016 (08:44 IST)
చాలా మంది గృహిణిలు తమ ఇళ్ళను ఎంతో అందంగా అలంకరిస్తారు. మరికొందరు మాత్రం ఇవేమీ పట్టించుకోరు. నిజానికి ఇంటిని అందంగా అలంకరించుకోవడం కూడా ఓ కళేనని గృహ నిపుణులు చెపుతున్నారు. అయితే, ఇందుకోసం మరికొన్ని సూచనలు పాటిస్తే పండగనాడు... మరింత చక్కగా తీర్చిదిద్దుకోవచ్చట. అవేంటో చూద్ధాం. 
 
* సాధారణంగా పండగ సమయాల్లో ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణాలు ప్రత్యేకతనిస్తాయి. వీటికి పువ్వులనూ జత చేసి ద్వారానికి వేలాడదీస్తే మరింత అందంగా కనిపిస్తాయి. దీంతో ఇంటికి కొత్త కళ వస్తుంది. ఇంట్లోని మిగతా గుమ్మాలకు చామంతులూ, తామరలూ, గులాబీలు.. ఇలా ఏవో ఒక పువ్వులతో సన్నని దండ కట్టి వేలాడదీస్తే ఇల్లు తాజాగా అనిపిస్తుంది. 
 
* ఇంట్లోని మెట్లూ, మూలల్లో రకరకాల ఆకృతుల్లో ఉండే కొవ్వొత్తులు ఉంచాలి. వాటి చుట్టూ బంతీ, చామంతీ రేకులతో అలంకరిస్తే చాలా బాగుంటుంది. పువ్వులే కాదు.. ఏవైనా తృణధాన్యాలూ ఉపయోగించొచ్చు. 
 
* రకరకాల రంగు కాగితాలతో చేసిన గాలిపటాలను కట్టి ముంగిట్లో వేలాడదీసి చూడండి.. ఎంత బాగుంటుందో! పూల కుండీలను కూడా హాల్లోని గుమ్మానికి ఇరువైపులా పెట్టొచ్చు. ఇలాంటి ఏర్పాట్ల వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుందని వారు చెపుతున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments