Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిని శుభ్రంగా ఉంచే క్లీనింగ్ ఏజెంట్స్ ఏవి!?

Webdunia
శనివారం, 11 అక్టోబరు 2014 (18:04 IST)
ఇంటిని శుభ్రం చేసేందుకు భారీ మొత్తాన్ని వెచ్చించి క్లీనింగ్ వస్తువులు కొంటున్నారా.? అయితే ఆగండి.. గాజు సామాన్లను క్లీన్ చేసుకొనే ద్రావణాన్ని కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక వంతు వినెగర్‌కు ఒక వంతు నీళ్ళు కలిపి, ఓ స్ప్రే బాటిల్‌లో ఉంచుకొంటే, అది గాజు సామాన్లను శుభ్రం చేయడానికి పనికొస్తుంది. అలాగే, చేతికి రబ్బరు తొడుగులు, ఇంట్లో దుమ్మూ ధూళి దులపడానికి ఉపయోగపడని కాటన్ దుస్తులను చిన్న చిన్న టవల్స్‌గా కట్ చేసి ఉపయోగించుకోవచ్చు. 
 
ఉప్పు, వంట సోడా, వినెగర్, నిమ్మకాయ లాంటివి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి తోడ్పడతాయి. ఉప్పు - కప్పులు, మగ్గులు టీ, కాఫీ మరకలతో ఎబ్బెట్టుగా తయారైతే, వాటిలో కొద్దిగా ఉప్పు చల్లి, అలా కాసేపు ఉంచేయాలి. ఆ తరువాత వాటిని రుద్ది, కడిగితే మరక మాయం. కప్పులు, మగ్గులు తేమగా ఉన్నప్పుడు ఈ పని చేస్తే మరింత సులభంగా పని జరుగుతుంది.
 
కూరలు తరిగే పీట క్రిమిరహితంగా ఉండాలంటే, దాని మీద కొద్దిగా ఉప్పు చల్లి, కొన్ని నిమిషాల తరువాత బాగా రుద్ది, నీటితో కడిగేయాలి. అల్యూమినియమ్ ఫ్రేమ్‌లను శుభ్రం చేయాలంటే, తడి గుడ్డ మీద కొద్దిగా ఉప్పు చల్లి, దానితో ఆ ఫ్రేమ్‌లను తుడవాలి. చీమలు, ఈగల బెడద లేకుండా ఉండాలంటే, నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి, దానితో గచ్చు తుడిస్తే సరి. వంటింట్లో గ్యాస్ స్టవ్ మీద పడ్డ మరకలను పోగొట్టాలంటే, సమపాళ్ళలో వంటసోడా, ఉప్పు కలిపి, పేస్ట్‌లా తయారు చేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.

APSET-2024 ఫలితాల విడుదల.. 2,444 మంది అభ్యర్థుల అర్హత

లాయర్ ఆఫీసులోకి వచ్చిన పాము.. పరుగులు తీసిన ఉద్యోగులు (వీడియో)

విమానం గాలిలో వుండగా.. తలుపులు తీశాడు.. ఆపై అరెస్టయ్యాడు..

బైకుకు నెంబర్ ప్లేట్ లేదు.. చైన్ స్నాచర్లుగా కాలేజీ స్టూడెంట్లు.. మహిళ వద్ద? (video)

మగబిడ్డ కోసం గర్భవతి కడుపును కొడవలితో కోశాడు.. చిప్పకూడు తప్పలేదు..

వరుణ్ సందేశ్ 'నింద' లో ‘సంకెళ్లు’ పాట విడుదల చేసిన గానామాస్ స్పెషల్ స్కూల్ కిడ్స్

జ్యోతిక, సూర్య నిర్మాణంలో కార్తీ, అరవింద్ స్వామి ఫ్రెండ్ షిప్ చిత్రం పేరు మెయ్యళగన్

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

Show comments