Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిని కలర్‌ఫుల్‌గా అలంకరించుకోవాలంటే?

Webdunia
సోమవారం, 18 ఆగస్టు 2014 (13:03 IST)
* మీ ఇంటిని కలర్‌ఫుల్‌గా రూపొందించేందుకు ప్రయత్నించండి. మీ టీపాయ్‌ను పూలతో కూడుకున్న మ్యాగజైన్‌లోతో అందంగా తీర్చిదిద్దండి.
 
* డార్క్ కలర్‌తో కూడుకున్న పూలకుండీలను ఏర్పాటు చేసుకోండి. దీంతో ఇంటి అందం మరింత రెట్టింపవుతుంది. 
 
* మీ ఇంట్లోని గెస్ట్ రూంలో ఏదైనా ఓ శిలలాంటి బొమ్మ లేదా స్ట్యాచ్యూ ఉంచండి. దీంతో ఆ గదికే ఓ ప్రత్యేకత వస్తుంది. 
 
* మీ ఇంట్లోని హాలులో ఓ టేబుల్‌పై క్రిస్టల్ వస్తువులను అలంకరించండి. దీంతో గది వాతావరణం చల్లగా ఉంటుంది. ఇంటికే ఓ కొత్త అందం సంతరించుకుంటుంది.
 
* ఇంటిని అందంగా తీర్చిదిద్దడంలో మహిళలు నిరంతరం శ్రమిస్తుంటారు. మరింత అందంగా తీర్చిదిద్దేందుకుగాను ఇంటి కిటికీలు, తలుపులు, గోడలు మొదలైన ప్రదేశాలలో గ్లాసులను అలంకరించండి. వీటిపై మీకు వీలైతే గ్లాస్ పెయింటింగ్ వేయించండి లేదా పెయింటింగ్‌తో కూడుకున్న గ్లాస్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటిని ఇంట్లో అలంకరించండి. 
 
* మీ ఇంట్లో పిల్లల గది రంగులమయం చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలకు రంగులంటే చాలా ఇష్టం. పిల్లలుండే గది గోడలకు ఎనామిల్ ప్రింట్ లేదా కార్టూన్‌లలోని పాత్రలకు చెందిన పోస్టర్‌లు అంటించండి. 
 
* మీరుండే ఇల్లు చిన్నదిగా ఉంటే అందులోని గదులు చిన్నవిగానే ఉంటాయి. ఆ గదులను పెద్దవిగా కనపడేలా ఉంచాలనుకుంటే ఏక్సెంట్ లైట్‌ను ఉపయోగించండి. ఆ లైట్‌ను ఫర్నీచర్ లేదా వాల్ ఆర్ట్‌పై ఫోకస్ చేయండి. దీంతో చిన్న గదికూడా పెద్ద గదిలా కనపడుతుంది.

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments