Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతల పానీయంతో మీ ఇల్లు తళతళ, ఎలాగో తెలుసా?

Webdunia
గురువారం, 1 జులై 2021 (15:52 IST)
శీతల పానీయాలు మొండి మరకల్ని వదలగొట్టడంలో బాగా పనిచేస్తాయి. వంటింట్లో మాడిన వంటసామాన్లు త్వరగా శుభ్రం కావు. అలాంటి పాత్రలో అర కప్పు కోలా వేసి ఓ పదినిమిషాల తర్వాత కడిగితే పాత్రకి పట్టుకున్న మాడు వెంటనే వదిలిపోతుంది. అలాగే స్టీలు సామాన్లపై పేరుకుపోయిన తుప్పు మరకల్ని కూడా కోలా ఇట్టే తొలగిస్తుంది. ఎక్కడైతే తుప్పు మరకలు ఉంటాయో... అక్కడ ఐదారు చుక్కల కోలా పోసి ఓ పావుగంట తర్వాత స్పాంజ్‌తో గట్టిగా తుడిస్తే వెంటనే తుప్పు మరకలు పోతాయి.
 
అలాగే బాత్‌రూమ్‌లలో వాడే టబ్బులు సున్నం మరకలతో ఉంటాయి. అలాంటి మరకల్ని కూడా కోలా ఇట్టే పోగొడుతుంది. టబ్బులపై కోలా నీళ్లు చల్లి పదినిమిషాల తర్వాత బ్రష్‌తో రుద్దితే కొత్త టబ్బుల్లా తయారవుతాయి. సన్నటి దుమ్ము పట్టిన గాజు అద్దాలను కూడా కోలాతో శుభ్రం చేసుకోవచ్చు. ఒక మగ్గులో ఒక కప్పు కోలా, రెండు కప్పుల నీళ్లు పోసి అందులో బట్టని ముంచి గట్టిగా పిండి ఆ బట్టతో అద్దాలను తుడిస్తే తళతళలాడుతాయి.
 
బట్టలపై ఉండే మరకలు మరింత ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా నూనె మరకలు. కొన్నిసార్లు రక్తపు మరకలు కూడా పోవు. ఈ రెంటికీ కోలా మంచి డిటర్జెంట్‌గా ఉపయోగపడుతుంది. బట్టల్ని నానబెట్టేముందు డిటర్జెంట్ నీళ్లలో రెండు కప్పుల కోలా కూడా పోయాలి. లేదంటే వాషింగ్ మిషన్‌లో వేసినా పరవాలేదు. నూనె, రక్తపు మరకలు త్వరగా వదిలిపోతాయి. కేవలం తాగడం కోసమే అనుకునే కోకో కోలా వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తర్వాతి కథనం
Show comments