Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోఫాసెట్ కొంటున్నారా..? కాసేపు ఆగండి..!!

Webdunia
శుక్రవారం, 23 జనవరి 2009 (20:15 IST)
WD PhotoWD
అందంగా నిర్మించుకున్న ప్రతి ఇంటి డ్రాయింగ్ రూముల్లోనూ సోఫాసెట్ ఇప్పుడు తప్పనిసరి అయిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంటికి కావాల్సిన ఫర్నీచరు కొనేటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే.. వస్తువుల పైపై మెరుగులను చూసి కొనేయడం. మనం డబ్బు పెట్టి కొనే వస్తువు అందం ఎంత ముఖ్యమని భావిస్తామో, వాటి నాణ్యత కూడా అంతే ముఖ్యం అన్న విషయాన్ని ఆయా సందర్భాల్లో మర్చిపోతుంటారు.
ఇలా ఉంటేనే హాయి..!!
  సోఫా వెనుక వైపున ఉండే బ్యాక్‌రెస్ట్.. మీ నడుం కింది భాగానికి దన్నుగా, హాయినిచ్చేదిగా ఉండాలి. కాళ్ళు నేలమీద ఆని సౌకర్యంగా కూర్చున్నట్లు... దానిపై కూర్చున్నవారికీ, చూస్తున్నవారికీ అనిపించాలి. కూర్చున్నప్పుడు సోఫా సీటు లోపలికి వెళ్తుంది కదా...! అలా...      


కాబట్టి, మీకు ఎంతో నచ్చిన సోఫాసెట్ మోడల్ ఎంచుకున్న మరుక్షణమే డబ్బు చెల్లించటం మానేసి కాసేపు దాని నాణ్యత గురించి ఆలోచించండి. అక్కడే వాటి నాణ్యత ఎలా తెలుస్తుంది, కొన్ని రోజులు వాడితేనే కదా..! అని అంటారేమో...! కింది జాగ్రత్తలను తీసుకున్నట్లయితే సోఫాల నాణ్యతను తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా...

మీరు ఎంపిక చేసుకున్న సోఫాసెట్‌పైన కనీసం పది నిమిషాలపాటు కూర్చోండి. అలా చేయడంవల్ల అది సౌకర్యంగా ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది. చేతులు పెట్టుకునే చోట, కింద, వెనక వైపున అంతా సమంగా... మెత్తగా ఉందా లేక ఎక్కడైనా గట్టిగా ఫ్రేమ్ తగులుతోందా అన్న విషయాలను గమనించండి.

ఇక సోఫా‌పై ఊరికే కూర్చోక కాసేపు అటూ, ఇటూ కదలండి. ఇలా చేయడంవల్ల మనం కదలినప్పుడు సోఫా కీచుమనే శబ్దం లాంటిదేదైనా చేస్తుందేమో తెలిసిపోతుంది. ఇకపోతే అది కీచుమని శబ్దం రాకుండా ఉన్నట్లయితేనే సరిగా ఉన్నట్లు, లేకుంటా అలాంటి దానిని ఎంచుకోకపోవడమే ఉత్తమం.

అలాగే సోఫా వెనుక వైపున ఉండే బ్యాక్‌రెస్ట్.. మీ నడుం కింది భాగానికి దన్నుగా, హాయినిచ్చేదిగా ఉండాలి. కాళ్ళు నేలమీద ఆని సౌకర్యంగా కూర్చున్నట్లు... దానిపై కూర్చున్నవారికీ, చూస్తున్నవారికీ అనిపించాలి. కూర్చున్నప్పుడు సోఫా సీటు లోపలికి వెళ్తుంది కదా...! అలా వెళ్ళడం పది సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉండకూడదన్న విషయాన్ని గమనించండి.

అతుకుల్లాంటివి ఉన్నచోట కాస్త జాగ్రత్తగా గమనించాలి. కుట్లు పటిష్ఠంగా ఉందీ లేనిదీ చూసుకోవాలి. ఇకపోతే ముఖ్యంగా సోఫా‌సెట్ వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే బ్రోచర్‌ను తీసుకోవడం మాత్రం మరువవద్దు.

చివరిగా మరో ముఖ్య విషయం ఏంటంటే... అసలు మీరు ఎంపిక చేసుకున్న సోఫా మీ హాలులో ఎక్కడ వేయాలో, అక్కడ అది పడుతుందో, లేదో చూసుకోవాలి. అలాగే సోఫా‌సెట్‌ను మీ గది గుమ్మంలోంచి లోపలికి తీసుకెళ్ళడం వీలవుతుందో, లేదో... దాని రంగు మీ ఇతర ఫర్నీచర్లకు సూటవుతుందో, లేదో తదితర విషయాలన్నింటీ క్షణ్ణంగా గమనిస్తే... నాణ్యమైన సోఫాసెట్‌ మీ సొంతమవుతుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments