కంప్యూటర్ బల్ల అందంగా...!

Raju
WD PhotoWD
లక్షలు పోసి సొంత ఇల్లు కట్టుకున్నా, ఆయా రూముల్లో ఎక్కడి వస్తువులక్కడ సర్దకపోతే ఇల్లంతా చిందరవందరగా, గందరగోళంగా ఉంటుంది. బెడ్‌రూంలో, వంటిట్లో, డ్రాయింగ్ రూంలో వస్తువులు ఒకచోటివి ఇంకోచోట పెడితే అసలు ఆ ఇంటికి ఇక అందమేముంటుంది.

ఇక చిన్నపిల్లల కోసం లేదా మన కోసం ప్రత్యేకంగా రూపొందించుకున్న రీడింగ్ రూంలో ప్రస్తుత కాలంలో కంప్యూటర్లు ఉండటం చాలా సాధారణమైన విషయం. అయితే కంప్యూటర్‌ను ఉంచే బల్లలపై పెన్నులు, పుస్తకాలు, సీడీలు, చిన్న చిన్న కాగితాలు లాంటివి పడేస్తే... ఆ బల్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.

రీడింగ్ రూంలో ప్రశాంతంగా చదువుకోవాలన్నా, అంతే హాయిగా కంప్యూటర్‌లో పని చేసుకోవాలంటే.. ఎక్కడి వస్తువులక్కడ అందంగా, శుభ్రంగా సర్దుకోవాలి. ముఖ్యంగా కంప్యూటర్ బల్లను సర్దుకోవటంలో చాలామంది నిర్లక్ష్యంగా వదిలేస్తుంటారు. అలా కాకుండా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే... బల్ల అందంగా కనిపించటమే కాకుండా, ప్రత్యేకంగా కూడా ఉంటుంది.

మామూలుగా, మన దైనందిన కార్యక్రమాలు, పూర్తిచేయాల్సిన ముఖ్యమైన పనులు, డెడ్‌లైన్స్, సంప్రదించాల్సిన వ్యక్తులు ఇలా ఎన్నో వివరాలను మనం డైరీలో రాసుకుంటాం. లేదా ఓ చిన్న పేపర్ ముక్కలో రాసుకుని అవసరం తీరిపోగానే వాటిని అలాగే వదిలేస్తుంటాం. దీంతో బల్లపై చెత్తకుప్ప పేరుకోవడం మొదలవుతుంది.

అలా కాకుండా... కంప్యూటర్ బల్లకు సమీపంలో ఓ డిస్‌‌ప్లే బోర్డును తగిలించి, అన్ని ముఖ్యమైన అంశాలను దానిపై రాసుకుంటే మరిచిపోరు. అంతేగాకుండా డైరీ, పేపర్ అవసరం అంతగా ఉండదు కూడా..! అయితే అన్నీ ఒకే రంగు పెన్నుతో రాయకుండా, నాలుగైదు రంగుల పెన్నులను వాడి రాస్తే సులభంగా గుర్తించవచ్చు.

ఉత్తరాలు, పంపించాల్సిన కొరియర్లు, పెన్ను, పెన్సిల్‌ లాంటి వన్నీ పట్టేలా కంప్యూటర్ బల్ల సమీపంలోనో లేదా పక్కనో ఒక స్టాండ్‌ ఏర్పాటు చేసుకుంటే మంచిది. అలాగే, చిన్న కప్పులో పదునైన కత్తెర, పేపర్లు కోసేందుకు చిన్న కత్తి, టేపు, స్టేప్లర్‌ వేసి బల్లపై ఓ మూల ఉంచుకోవడం మంచి పద్ధతి.

ఇక చివరగా... కంప్యూటర్ బల్లకు ఉండే సొరుగుల్లో సీడీలు, ముఖ్యమైన కాగితాలు, పుస్తకాలు లాంటి వాటిని అమర్చండి. అంతేగాకుండా బల్ల మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు చక్కని టేబుల్‌ ల్యాంప్‌ కూడా ఏర్పాటు చేయండి. పైన చెప్పిన చిట్కాలన్నింటినీ పాటించి చూడండి.. మీ కంప్యూటర్ బల్ల అందంగా, సౌకర్యవంతంగా మెరిసిపోవడం మాత్రం ఖాయం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అహంకారంతో అన్న మాటలు కాదు.. క్షమించండి : శివజ్యోతి

రిచెస్ట్ బెగ్గర్స్... తిరుమలలో ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం...

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Show comments