Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవిష్యత్ క్రీడాకారుల కోసం ప్రణాళిక : బింద్రా

Webdunia
బుధవారం, 24 సెప్టెంబరు 2008 (14:47 IST)
భారత్‌లోని వర్థమాన క్రీడాకారులకు చేయూతనిచ్చే దిశగా తాను ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా తన ఆధ్వర్యంలో 500 పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించనున్నట్టు బింద్రా పేర్కొన్నారు.

ఈ విషయమై బింద్రా మాట్లాడుతూ నాణ్యమైన విద్య, క్రీడల్లో శిక్షణ ఇచ్చే విధంగా ఈ స్కూళ్లను తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. అభినవ్ బింద్రా ఏస్ పబ్లిక్ స్కూల్స్ (ఏబీఏపీఎస్) పేరుతో స్థాపించనున్న ఈ పాఠశాలల విషయమై బింద్రా మీడియాకు వివరించారు. తాను స్థాపించనున్న ఈ పాఠశాలల బాగోగులను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని బింద్రా తెలిపాడు.

భవిష్యత్‌లో ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో తన పాఠశాలలకు సంబంధించిన శాఖ ఉండేలా చూస్తానని బింద్రా పేర్కొన్నాడు. ఈ పాఠశాలలకు సంబంధించి చదువు ఇతర వసతులు అన్ని చోట్లా ఒకేలా ఉంటాయని కూడా బింద్రా తెలిపాడు. ఈ పాఠశాలల్లో విద్యతో పాటు షూటింగ్, ఆర్చరీ, ఈక్వెస్ట్రియన్, టెన్నిస్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల్లో విద్యార్ధుల ఉన్నత స్థాయి శిక్షణ అందించనున్నట్టు బింద్రా తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

Show comments