Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమీలవల్లిపై జీవితకాల నిషేధం విధించిన సమాఖ్య

Webdunia
శనివారం, 4 అక్టోబరు 2008 (14:33 IST)
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెయిట్ లిప్టింగ్ క్రీడాకారిణి బొరాడి ప్రమీలవల్లిపై భారత వెయిట్ లిప్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) జీవితకాల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కెరీర్‌లో రెండుసార్లు డోప్ టెస్టుల్లో పట్టుబడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాఖ్య పేర్కొంది.

గత నెల నొయిడాలో జరిగిన జూనియర్ జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల సందర్భంగా ప్రమీలవల్లి డోప్ పరీక్షల్లో పట్టుబడింది. గతంలో సైతం ఇదే విధంగా డోపింగ్ టెస్టులో పట్టుబడిన చరిత్ర ఉండడంతో ప్రమీలపై ఐడబ్ల్యూఎఫ్ జీవితకాల నిషేధం విధించింది. గతంలో 2006లో మెల్‌బోర్న్‌లో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల సందర్భంగా వాడా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో సైతం ప్రమీల పట్టుబడడంతో అప్పట్లో ప్రమీలపై రెండేళ్ల నిషేధం విధిస్తూ ఐడబ్ల్యూఎఫ్ నిర్ణయం తీసుకుంది.

అప్పుడు విధించిన రెండేళ్ల నిషేధం ఈ ఏడాది మార్చిలో పూర్తికాగా మళ్లీ ప్రమీల డోపింగ్ పరీక్షల్లో పట్టుబడడం గమనార్హం. ప్రమీలతో పాటు కర్ణాటకు చెందిన వెయిట్ లిఫ్టర్ సతీష్ రాయ్‌పై కూడా జీవితకాల నిషేధం విధిస్తూ సమాఖ్య నిర్ణయం తీసుకుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments