Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోంగూర రొయ్యల పులుసు

Webdunia
శనివారం, 15 నవంబరు 2014 (15:21 IST)
కావల్సిన వస్తువులు:
గోంగూర - ఒక కప్పు,
రొయ్యలు - పావుకప్పు,
నెయ్యి - నాలుగు స్పూన్లు
టమాటాలు - మూడు పెద్దవి
అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
ఉల్లిపాయలు - రెండు,
పచ్చిమిర్చి, ఎండుమిర్చి - నాలుగు,
తాలింపు గింజలు - అన్నీ కలిపి కొద్దిగా,
ధనియాలపొడి - అరటీస్పూన్
పసుపు - అర టీ స్పూన్న
కారం - రెండు చెంచాలు,
ఉప్పు - రుచికి తగినంత,
కరివేపాకు, కొత్తిమీర - గార్నిషింగ్ కోసం.
 
తయారు చేయండి ఇలా :
గోంగూరను బాగా కడిగి ఉడికించి పెట్టుకోవాలి. పాన్‌లో నెయ్యి, శుభ్రం చేసిన రొయ్యల్ని వేసి బాగా వేయించాలి. ఈ వేయించిన రొయ్యల్ని నెయ్యి లేకుండా విడిగా తీసిపెట్టుకోవాలి. ఈ మిగిలిన నెయ్యిలో ఎండుమిర్చి, తాలింపుదినుసులు ఉల్లిపాయముక్కలు, కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించాలి. అవి వేగాక అల్లం వెల్లుల్లి మిశ్రమం ఆ తరువాత టమాటా ముక్కలు చేర్చాలి. ఆ తరువాత ఉడికించి పెట్టుకున్న గోంగూర, కాస్త పసుపు, ఉప్పు, కారం వేసి మూతపెట్టాలి. మరికాసేపయ్యాక ధనియాలపొడి, వేయించిన రొయ్యల్ని చేర్చాలి. ఐదారునిమిషాలయ్యాక కొత్తిమీర చల్లి దింపేస్తే సరిపోతుంది. అంతే ఎంతో రుచికరమైన గోంగూర రొయ్యల కూర సిద్ధం అయినట్టే.

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

Show comments