క్రిస్మస్ స్పెషల్ మిక్స్‌డ్ చాక్లెట్ డ్రైఫూట్ కేక్

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2015 (15:41 IST)
క్రిస్మస్ వచ్చిందంటే అందరి ఇంట్లో కేక్‌‌ల సందడి మొదలైనట్లే. క్రిస్మస్ పండుగకు ఎంత ముఖ్యత్వముందో కేక్‌లకు అంతే ముఖ్యత్వం ఉంది. అలాంటి కేకు తయారీవిధానం గురించి తెలుసుకుందాం! 
 
కావలసిన పదార్థాలు :
 
బటర్: 150 గ్రాములు
మైదాపిండి:100 గ్రాములు
ఎండు ద్రాక్ష: 20
బాదం పప్పు : 20
పిస్తా పప్పు : 20
జీడి పప్పు : 20
బేకింగ్ పౌడర్: 1/2 స్పూన్
చాక్లెట్ ఎసెన్స్: 1/2 స్పూన్
చక్కెర పొడి: 150  గ్రాములు
గుడ్డు: 3
పాలు: 1 కప్పు
 
తయారీ విధానం :
 
మైదాపిండిని, బేకింగ్ పౌడర్‌ను కలిపి జల్లించి పక్కన పెట్టుకోవాలి. చక్కెరను కూడా పౌడర్‌ చేసుకోవాలి
తర్వాత జల్లించిన మైదాపిండి, బేకింగ్ పౌడర్‌లతో వెన్నను, పంచదార పొడిని బాగా కలిపి క్రీమ్‌లాగా తయారు చేసుకోవాలి.
ఆ తర్వాత 3 గుడ్లను బ్లెండర్‌తో బీట్ చేసుకుని దీంట్లో చాక్లెట్ ఎసెన్స్‌ను కూడా వేసి బాగా కలపాలి. 
తర్వాత ఈ మిశ్రమానికి  ఎండు ద్రాక్షను, జీడి పప్పు, పిస్తా పప్పు, బాదం పప్పుచేర్చి, మైదాను కూడా కలిపి, ఒక కప్పు పాలు పోసి పిండి చిక్కగా కాకుండా జారుగా ఉండేట్లు కలుపుకోవాలి. కేక్ ట్రేలో కొద్దిగా వెన్నెపూసి జారుగా కలుపుకున్నమిశ్రమాన్నిపోసి 
500 డిగ్రీల ఫారెన్‌హీట్‌లో 30 నిమిషాల పాటు అవెన్‌లో బేక్ చేయాలి. అంతే మిక్స్‌డ్ చాక్లెట్ డ్రైఫూట్ కేక్ రెడీ. గార్నిషింగ్ కి కావాలంటే చెర్రీ పండ్లు వాడుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గ్రామాల్లో ప్రజలకు నచ్చిన ఆలయాలను నిర్మిస్తాం : మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

ఏఐ సాంకేతికతతో విద్యార్థిని ఫోటోలను మార్ఫింగ్ చేసిన ట్యూషన్ టీచర్.. సంకెళ్లు వేసిన ఖాకీలు

వర్షంతో బైక్ పంక్చర్.. రెండు నిమిషాలు లేట్.. నీట్ సెంటర్‌‌లోని నో పర్మిషన్.. ఏం జరిగిందంటే? (video)

నటుడు ప్రకాష్ రాజ్‌కు నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు - నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

ప్రకాశం జిల్లాలో దారుణ హత్య : వివాహేతర సంబంధమే కారణమని అనుమానం?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ ఫోటోకి నువ్వక్కర్లేదు, పక్కకెళ్లు అంటూ శ్రీలీలకు వేలు చూపిస్తూ షాకిచ్చిన సీఎం భార్య, వీడియో

Vijay Birthday Special: రూ.500ల యాక్టర్ నుంచి తమిళనాడు సీఎం వరకు.. జననాయగన్ జర్నీ

The red bag teser: నలుగురు గాళ్స్ ది రెడ్ బ్యాగ్ కోసం ఏం చేశారు ?

Pawan Kalyan: సి.ఎం. విజయ్ నిర్ణయంతో అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్

Mamitha Baiju: విశ్వనాథ్ & సన్స్ తో జెంజీ పాత్ర పోషించిన మమితా బైజు

Show comments