వర్షాకాలం : శొంఠి కాఫీతో జలుబుకు చెక్ పెట్టండి.

Webdunia
సోమవారం, 14 జులై 2014 (18:49 IST)
శొంఠి, జీర్ణశక్తికి బాగా పని చేస్తుంది. ప్రతిరోజు ఆహారంలో తగినంత  చేర్చుకుంటే చాలా మంచిది. కడుపులో నులిపురుగుల నివారణకు ఇది ఉపకరిస్తుంది. తలనొప్పి వస్తే శొంఠి నీటిలో అరగదీసి కణతలకు, నుదురుకు పట్టించాలి. వెంటనే ఉపశమనం కలుగుతుంది. శొంఠి పొడి, మిరియాలు, పిప్పళ్లు (త్రికటు) వీటిని తేనెతో కలిపి గాని లేదా టీ మాదిరిగా మరిగించి తీసుకుంటే ఆయాసం తగ్గుతుంది. శొంఠి కషాయం చేసుకుని తాగితే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. వర్షాకాలంలో కషాయమంటే ఇష్టంలేని వాళ్లు జలుబును దూరం చేసుకోవాలంటే శొంఠి కాఫీని ట్రై చేయండి. 
 
కావలసిన పదార్థాలు :
శొంఠి - 50గ్రాములు 
ఏలకులు - 5, 
బెల్లం - 50 గ్రాములు 
పాలు - ఒక కప్పు 
 
తయారీ విధానం : 
ముందుగా శొంఠి, ఏలకులను పౌడర్‌లా మిక్సీలో కొట్టిపెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్రలో ఒక కప్పు నీరు పోసి పొడి చేసిన శొంఠి, ఏలకుల పొడిని రెండు స్పూన్లు చేర్చి, అందులో బెల్లం కూడా తగినంత కలుపుకోవాలి. ఈ మిశ్రమం మరిగాక స్టౌ మీద నుంచి దించి ఫిల్టర్ చేసుకోవాలి. మరో పాత్రలో పాలు కాచుకుని రెండింటిని మిక్స్ చేసి వేడి వేడిగా సర్వ్ చేస్తే జలుబు, తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హనీమూన్‌కు వెళ్లొచ్చిన దంపతుల ఆత్మహత్య.. ఏం జరిగింది?

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పిల్లుల్లా బంకర్లలో దాక్కున్నారు : పాక్ అధ్యక్షుడు జర్దారీ (Video)

ఏపీకి రూ.9470 కోట్ల విలువ చేసే రైల్వే ప్రాజెక్టులు : కేంద్రం వెల్లడి

బంగ్లాదేశ్‌లో ఆటవిక రాజ్యం... హిందువులను చంపేస్తున్న అరాచక మూకలు

కర్నాటకలో నిరుపేదల ఇళ్లపై బుల్‌డోజర్... సీఎం సిద్ధూ ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ద్వాదశ జ్యోతిర్లాంగాల దర్శనం పూర్తి చేసుకున్న కంగనా రనౌత్

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడుగా డి.సురేష్ బాబు

తలైవర్‌తో లవ్ స్టోరీ తీయాలన్నదే నా కల : సుధా కొంగరా

అభిమానులకు కోసం సినిమాలకు స్వస్తి : హీరో విజయ్ ప్రకటన

డార్లింగ్ ఫ్యాన్స్‌కు మంచి వినోదం ఇవ్వాలనే "రాజాసాబ్" చేశాం... ప్రభాస్

Show comments